Homeఎంటర్టైన్మెంట్Kajal Agarwal: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన కాజల్ అగర్వాల్ బేబీ బంప్...

Kajal Agarwal: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటోలు…

Kajal Agarwal: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. చందమామ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది.

kajal agarwal baby bump photos goes viral on social media

అయితే కెరీర్ మంచి పాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని సెటిలైంది టాలీవుడ్ చందమామ. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయడానికి సిద్ధమేనని చెప్పింది. అలా.. వివాహం చేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆచార్య సినిమాలో నచించింది కాజల్.

Also Read: సెలబ్రెటీలను వదలని కరోనా.. లేటెస్ట్ గా ఇద్దరు హీరోయిన్లకు..!

అయితే గత కొద్ది రోజులుగా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇదే కారణం చేతనే కాజల్ నాగార్జున ఘోస్ట్ సినిమా, మిగిలిన ప్రాజెక్టులను కూడా రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 నుంచి కూడా కాజల్ తప్పునట్లుగా సమాచారం. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలను గతంలోనే ఖండించింది కాజల్. తన ప్రెగ్నెన్సీ గురించి ఏం మాట్లాడాలని అనుకోవడం లేదని… సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Also Read: ఆ విషయంలో ‘సమంత’ను ఫాలో అవుతున్న కాజల్ !

ఇప్పుడు తాజాగా కాజల్ తన ఇన్‏స్టా స్టోరీలో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలలో కాజల్ బేబీ బంప్ కనిపిస్తోంది. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి కాజల్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఇప్పుడు కాజల్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతుండడంతో త్వరలోనే కాజల్ ఈ విషయంపై అధికారికంగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు నెటిజన్స్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular