ట్రంప్ తో డాన్స్ చేయిస్తానంటున్న గాయకుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 24, 25తేదిల్లో ట్రంప్ పర్యటన ఖారారైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరుదేశాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడిచే స్టెప్పులేయిస్తానని గాయకుడు ఖైలాష్ ఖేర్ అంటున్నాడు. ఈనెల 24 నుంచి ట్రంప్ గుజరాత్ లోని అహ్మాదాబాద్ కు చేరుకొని నమస్తే మోడీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సర్దార్ వల్లభాయ్ స్టేడియలో అమెరికాలో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమాన్ని మించిపోయేలా ఏర్పాట్లు చేశారు. […]

Written By: Neelambaram, Updated On : February 24, 2020 11:13 am
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 24, 25తేదిల్లో ట్రంప్ పర్యటన ఖారారైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరుదేశాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడిచే స్టెప్పులేయిస్తానని గాయకుడు ఖైలాష్ ఖేర్ అంటున్నాడు.

ఈనెల 24 నుంచి ట్రంప్ గుజరాత్ లోని అహ్మాదాబాద్ కు చేరుకొని నమస్తే మోడీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సర్దార్ వల్లభాయ్ స్టేడియలో అమెరికాలో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమాన్ని మించిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీని కళాకారులు ఆడిపాడనున్నారు. ప్రముఖ గాయకుడు ఖైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో పాటలను పాడనున్నాడు. ట్రంప్ పర్యటనపై ఆయన స్పందిస్తూ వీలైతే తన పాటకు ట్రంప్ చేత డాన్స్ చేయిస్తానంటూ సరదాగా వ్యాఖ్యనించారు.

అనంతరం ట్రంప్ కుటుంబం ఆగ్రాలోని తాజ్ మహాల్ ను సందర్శించనుంది. 25న ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటికే ఆహ్వానం అందింది. ట్రంప్ పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ట్రంప్ తిరిగి అమెరికా వెళ్లే వరకు కట్టుదిట్టమైన భద్రత కొనసాగనుంది.