Homeఎంటర్టైన్మెంట్Ka Movie Twitter Review: క మూవీ ట్విట్టర్ రివ్యూ: సవాల్ విసిరిన కిరణ్ అబ్బవరం...

Ka Movie Twitter Review: క మూవీ ట్విట్టర్ రివ్యూ: సవాల్ విసిరిన కిరణ్ అబ్బవరం మూవీ ఎలా ఉందంటే? చూసి తీరాల్సిందే!

Ka Movie Twitter Review: కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం ఆయన నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం మంచి విజయం సాధించింది. వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఐతే ఆయనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కిరణ్ అబ్బవరం పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. దాంతో ఆయన హర్ట్ అయ్యారు. క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రోలింగ్ పై కిరణ్ అబ్బవరం అసహనం వ్యక్తం చేశాడు.

క మూవీ విజయం సాధించకపోతే ఇకపై సినిమాలు చేయను అన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న క మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కిరణ్ అబ్బవరం అంత విశ్వాసంగా చెప్పిన క మూవీలో విషయం ఉందా? క మూవీ కథ విషయానికి వస్తే… హీరో ఒక అనాథ. ఓ ఆశ్రమంలో పెరుగుతాడు. తనకు ఎవరూ లేకపోవడం కారణంగా చిన్నప్పటి నుండి ఇతరులకు వచ్చే ఉత్తరాలు చదవడం అలవాటుగా ఉంటుంది.

అనాథాశ్రమానికి వస్తున్న ఉత్తరాలన్నీ రహస్యంగా చదువుతున్నాడని తెలుసుకున్న యజమాని హీరోని కొడతాడు. అక్కడ నుండి పారిపోతాడు. కొన్నాళ్ళకు ఓ ఊరికి పోస్ట్ మ్యాన్ గా పని చేస్తున్న వ్యక్తి వద్ద అసిస్టెంట్ గా చేరి, ఉత్తరాలు చేరవేస్తూ ఉంటాడు. తన అలవాటు వదలకుండా అందరి ఉత్తరాలు రహస్యంగా చదువుతూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోకి ఆ ఊరికి సంబంధించి కొన్ని కీలక అంశాలు తెలుస్తాయి. హీరో తెలుసుకున్న అనూహ్య పరిణామాలు ఏమిటీ? అసలు హీరో నేపథ్యం ఏమిటీ? అతడు ఎందుకు ఉత్తరాలు చదువుతున్నాడు? అనేది మిగతా కథ..

ప్రేక్షకుల అభిప్రాయంలో క మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ దర్శక ద్వయం సుజీత్ అండ్ సందీప్ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా తీర్చిదిద్దారు. కిరణ్ అబ్బవరం చెప్పినట్లు క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా ఉంటుంది. సినిమాకు ఇదే ప్రధాన హైలెట్. విజువల్స్, కెమెరా వర్క్ బాగుంది.

కిరణ్ అబ్బవరం బాగా నటించాడు. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం మెప్పిస్తుంది. చిన్న చిన్న లోపాలను మినహాయిస్తే క మూవీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎంగేజింగ్ గా సాగుతుంది. ప్రేక్షకుడికి గొప్ప అనుభూతి పంచుతుంది. సస్పెన్సు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇంకా బాగా నచ్చుతుంది.

RELATED ARTICLES

Most Popular