Cash: సుమ చేస్తున్న కార్యక్రమాల్లో లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ లో ఒకటి ‘క్యాష్’. ప్రతివారం శనివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి బుల్లితెర నుండి వెండి తెర దాక ఉన్న ప్రతిఒక్క సెలబ్రిటీస్ వస్తూనే ఉంటారు. అలా రాఘవేంద్రరావు ప్రొమోషన్స్ లో భాగంగా తన పెళ్లిసందడి టీం తో క్యాష్ ప్రోగ్రాం కి వచ్చాడు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధం గా ఉన్న ఈ సినిమాలో శ్రీకాంత్ తనయడు రోషన్ నటిస్తున్నాడు.

ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో రోషన్ సరసన కన్నడ బ్యూటీ శ్రీలీల కొత్త పెళ్లిసందడి లో మెరవనున్నది. అక్టోబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. పేరుకి దర్శకురాలు అయిన పూర్తి బాధ్యతలు చూసుకుంటూ వెనకనుండి నడిపేది మాత్రం రాఘవేంద్ర రావు. ఇప్పుడు ప్రొమోషన్స్ లో కూడా అన్ని తానై దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు.
ప్రమోషన్స్ లో భాగంగా కొత్త పెళ్లి సందడి టీం మొత్తం క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు. వచ్చిరాగానే తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి స్వాగతం పలికింది సుమ. ఇంక రాఘవేంద్ర రావు వచ్చినప్పుడు ఆయినా కాళ్ళ దగ్గర కూర్చుని తనదైన రీతిలో పంచ్ ల వర్షం కురిపించింది. ఇదిలా ఉండగా రాఘవేంద్ర రావు ఇంట్రడక్షన్ లో మెట్లు ఎక్కుతుండగా తన జారిపోతున్న ప్యాంటు ని సరిచేసుకుంటూ మెట్లు ఎక్కా డు. దానికి సుమ తనదైన రీతిలో … మీ దగ్గర నుండే చిరంజీవి గారు స్టెప్ నేర్చుకున్నారేమే అంటూ రాఘవేంద్రరావు మీద పంచ్ వేసింది. దానికి కౌంటర్ ఇస్తూ… సుమా నేను నా ప్యాంట్ జారిపోకుండా అలా సర్దుకుంటే దానిపై నువ్వు వెక్కిరిస్తావా.. నీపై కేసు పెడతాను నేను అంటూ .. తగ్గేదే లే అనేసాడు.
ఇదంతా జరిగింది కామెడీకి అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. అంతే కాకుండా చివర్లో ప్రోమో కోసం ఇంకో సీరియస్ సీన్ ని క్రియేట్ చేశారు కొత్త పెళ్లి సందడి టీం. ఇక్కడ వరకు తీసుకొచ్చి డబ్బులు కూడా ఇవ్వకుండా కాలి చేతులతో పంపిస్తున్నారు ఇదెక్కడి న్యాయం అంటూ.. సుమ తమను మోసం చేస్తుంది అంటూ రెచ్చిపోయి షో నుండి వెళ్ళిపోతున్నట్టు నటించాడు రాఘవేంద్రరావు.