మంచి కుర్రోడు ఉంటే చెప్పండి.. నేను రెడీ !

ఆమె ఒకప్పుడు వెండితెర పై సెగలు పుట్టించింది, ఇప్పటికీ తనదైన శైలిలో కుర్రకారును మత్తెక్కించడానికి తెగ ఆరాట పడుతుంది. అందుకే మరీ బరి తెగించిన కామెంట్స్ ను అడ్డుగోలుగా చేసేసింది. ‘నేను డేటింగ్‌కి రెడీగా ఉన్నాను, నా కోసం ఎవరైనా మంచి కుర్రోడు ఉంటే చెప్పండి, ఇప్పటికిప్పుడు ఎవరైనా డేటింగ్‌ కి వస్తే.. నేను రెడీ’ అంటూ.. అబ్బో ఈ ముదురు హాట్ బ్యూటీ బోల్డ్ నెస్ కి హాట్ వరల్డ్ అంతా షేక్ అయిపోయేలా స్టేట్ […]

Written By: admin, Updated On : April 27, 2021 12:25 pm
Follow us on

ఆమె ఒకప్పుడు వెండితెర పై సెగలు పుట్టించింది, ఇప్పటికీ తనదైన శైలిలో కుర్రకారును మత్తెక్కించడానికి తెగ ఆరాట పడుతుంది. అందుకే మరీ బరి తెగించిన కామెంట్స్ ను అడ్డుగోలుగా చేసేసింది. ‘నేను డేటింగ్‌కి రెడీగా ఉన్నాను, నా కోసం ఎవరైనా మంచి కుర్రోడు ఉంటే చెప్పండి, ఇప్పటికిప్పుడు ఎవరైనా డేటింగ్‌ కి వస్తే.. నేను రెడీ’ అంటూ.. అబ్బో ఈ ముదురు హాట్ బ్యూటీ బోల్డ్ నెస్ కి హాట్ వరల్డ్ అంతా షేక్ అయిపోయేలా స్టేట్ మెంట్ ఇచ్చింది. మొత్తానికి ఎంతమంది వ్యాంప్ బ్యూటీలు రేసులోకి వచ్చిన.. తనలోని హాట్ నెస్ కు ఎవ్వరూ సరితూగరు అంటూ రెచ్చిపోయింది ప్రముఖ సీనియర్ ఐటమ్ బాంబ్ ‘జ్యోతి’.

ఇంతకీ చాల గ్యాప్ తరువాత ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తోందో తెలియదు గానీ, ప్రస్తుతం అవకాశాలు కోసమైతే ఏమి చేయడానికి తానూ రెడీ అనేలా ఉంది జ్యోతి వ్యవహారం. అయితే ఇప్పటికీ తానూ టైట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్నాని కూడా చెబుతుంది. అలాగే అవకాశం వస్తే.. మళ్ళీ లీడ్ రోల్స్ చేస్తానంటుంది. మొత్తమ్మీద వరుస ఇంటర్వ్యూలలో ఇలా విచ్చలవిడిగా రొచ్చు మాటలు మాట్లాడుతూ అలా తనదైన శైలిలో ముందుకుపోతుంది జ్యోతి. అయితే ఇప్పటి జెనరేషన్ కుర్రకారుకు మత్తెక్కించే జ్యోతి సరిగ్గా తెలియదట. తనను ఇప్పటి కుర్రాళ్ళు అందరూ గుర్తు పట్టడం లేదని కూడా తెగ ఫీల్ అయిపోతుంది.

మరి అప్పటి పలు సినిమాల్లో బోల్డ్ పాత్రలతో ఆకట్టుకున్న జ్యోతి, సినిమాల్లో యాక్టివ్ గా నటించి చాల సంవత్సరాలు అయిందయ్యే. బిగ్ బాస్ సీజన్- 1లో పార్టిసిపేట్ చేశాక కూడా ఆమెకు అవకాశాలు రాలేదు. దాంతో చాలాకాలంగా కెమెరాకు దూరంగా ఉంటూ వస్తోంది. మధ్యలో బుల్లితెర పై కూడా కనిపించాలని ఆసక్తి చూపించినా.. బుల్లితెర పై కూడా ఆమెకు సరైన ఆదరణ లభించ లేదు.

ఇక ఎలాగూ వెండితెర తనకు విరామం ఇచ్చింది కాబట్టి… ఇక అక్కడ ఆమె ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేయకుండా సైలెంట్ అయిపోయి ఇంటికే పరిమితం అయిపోయింది. అయితే ఈ లోపు ఈ బోల్డ్ బ్యూటీ వ్యక్తిగత జీవితం పై ఎన్నో వార్తలు పుట్టించారు రాతల రాయుళ్లు. తాజాగా వాటిపై క్లారిటీ ఇస్తూ పై కామెంట్స్ తో కుర్రాళ్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది జ్యోతి.