Homeఎంటర్టైన్మెంట్Junior NTR: గూస్ బంప్స్ రేపుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, అక్కడ సడన్ గా ప్రత్యక్షం...

Junior NTR: గూస్ బంప్స్ రేపుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, అక్కడ సడన్ గా ప్రత్యక్షం కారణం ఇదే!

Junior NTR: ఇటీవల ఎన్టీఆర్ నటించిన ఓ యాడ్ బయటకు వచ్చింది. అందులో ఎన్టీఆర్ ని చూసి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లుక్ ఏమంత ఇంప్రెసివ్ గా లేదు. ఎందుకు ఇలా తయారయ్యాడని వేదన చెందారు. అయితే వారికి లేటెస్ట్ ఆఫ్ స్క్రీన్ లుక్ సంతోషాన్ని ఇచ్చింది. ఫిట్ అండ్ స్లిమ్ గా ఉన్న ఎన్టీఆర్ లుక్ గూస్ బంప్స్ రేపుతోంది. వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్లారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కనిపించడంతో ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాల్లో బంధించారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!

ఆయన ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా. ఎన్టీఆర్ రా ఏజెంట్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఎన్టీఆర్ చేస్తున్న మరో భారీ మల్టీస్టారర్ వార్ 2 కావడం విశేషం. హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్-హృతిక్ రోషన్ లపై లార్జ్ స్కేల్ లో సాంగ్ చిత్రీకరించారట. వందల మంది డాన్సర్స్ పాల్గొన్నారట. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి మించి ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ మూవీ వార్ 2. త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నాడట. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. పక్కా ప్రణాళికతో ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పూర్తి చేయనున్నాడట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలి అనేది ఆలోచన అట. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుండగా.. మధ్య సలార్ తెరకెక్కించి విడుదల చేశాడు. ఇక డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది.

నెక్స్ట్ ఎన్టీఆర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీ చేయనున్నాడట. ఈ మూవీ టైటిల్ రాక్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆయన గత చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, దేవర పాన్ ఇండియా స్థాయిలో విజయాలు అందుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular