Junior NTR Balayya Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన సినిమాలు బి, సి సెంటర్ లో పెను ప్రభంజనాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవల్లో నిలబెట్టాయి. బాలయ్య మాస్ హీరోగా అవతరించడమే కాకుండా కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను పొందుతున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం కెరియర్ మొదట్లోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాడు. ఆ తర్వాత తను టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లబోతున్నాడు… బాలయ్య బాబు చేసిన లక్ష్మీనరసింహ సినిమాని ముందు జూనియర్ ఎన్టీఆర్ చేయాలనుకున్నాడు.
Also Read: బైకర్.. రేసింగ్ లు నచ్చేవారికి ఓకే
కానీ అనుకోని కారణాల వల్ల బాలయ్య బాబు ఆ సినిమా నేను చేస్తానని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. నిజానికి లక్ష్మీనరసింహ మూవీ తమిళంలో వచ్చిన స్వామి సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.
అయినప్పటికి తన బాబాయ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తప్పుకొని బాలయ్య కి ఆ సినిమాను చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో బాలయ్య సినిమాతో సక్సెస్ ని సాధించి మరోసారి హిట్ ట్రాక్ అయితే ఎక్కాడు. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గారి మధ్య అప్పట్లో చాలా మంది సన్నిహిత సంబంధలైతే ఉండేవి.
కానీ ఈ మధ్య కొన్ని విభేదాలు రావడం వల్ల ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు…తొందర్లోనే మళ్లీ కలిసిపోయి కనిపిస్తే చూడాలని వల్ల అభిమానులు కోరుకుంటున్నారు…ఇది వర్కౌట్ అవుతుందా వీళ్ళందరూ కలిసిపోయి కనిపిస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
