Pushpa 2- NTR: ‘పుష్ప : ది రూల్’ లో జూనియర్ ఎన్టీఆర్..సుకుమార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

ఎన్టీఆర్ ఇందులో గెస్ట్ రోల్ చేస్తుంటే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనే చెప్పాలి.మరి ఈ విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టాడు డైరెక్టర్ సుకుమార్.వచ్చే ఏడాది మే నెలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.

Written By: Vicky, Updated On : April 27, 2023 2:21 pm
Follow us on

Pushpa 2- NTR: ‘స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప సినిమా ఎంత ప్రత్యేకమో మన అందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతీ ప్రాంతీయ భాషలో మోత మోగించేసింది. రాజమౌళి సహాయం లేకుండా ఒక స్టార్ హీరో ఈ రేంజ్ లో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవ్వడం జరిగింది అల్లు అర్జున్ విషయం లోనే.

అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ సుకుమార్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చెయ్యడం కోసమే ఏడాది సమయం తీసుకున్నాడు. గత కొద్దిరోజుల నుండి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

అదేమిటంటే గత రెండు రోజుల నుండి జూనియర్ ఎన్టీఆర్ పుష్ప మూవీ సెట్స్ కి వచ్చి పోతున్నాడు. రామోజీ ఫిలిం సిటీ పుష్ప సినిమాతో పాటు, ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ మంచి స్నేహితులు కాబట్టి సరదాగా చిట్ చాట్ చెయ్యడం కోసం కలుస్తున్నారా, లేదా సుకుమార్ ఎన్టీఆర్ తో చిన్న గెస్ట్ రోల్ లాంటిది చెయ్యిస్తున్నాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

ఒకవేళ ఎన్టీఆర్ ఇందులో గెస్ట్ రోల్ చేస్తుంటే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనే చెప్పాలి. మరి ఈ విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టాడు డైరెక్టర్ సుకుమార్. వచ్చే ఏడాది మే నెలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించబోతుందో చూడాలి.