Junior NTR: రాజమౌళి దర్శకత్వం లో గత ఏడాది తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీస్టార్రర్ చిత్రం #RRR ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఇద్దరు మాస్ హీరోలను వెండితెర మీద చూసే అదృష్టం ప్రతీ ఒక్కరికీ కలిగింది..కలలో కూడా జరగదు అనుకున్న ఈ కాంబినేషన్ తెరకెక్కి, బాక్స్ ఆఫీస్ పరంగా వండర్స్ సృష్టించడం అంత ఒక కలగా జరిగిపోయింది..హీరోలిద్దరిని ఒక ఫ్రేమ్ మీద చూసి అలవాటు పడిన అభిమానులకు మళ్ళీ వీళ్ళిద్దరిని కలిసి ఎప్పుడు చూస్తామో అని అనుకున్నారు.

కానీ #RRR సినిమాని వీళ్ళు వదిలేసినా, #RRR మాత్రం ఈ హీరోలను వదలడం లేదు..గత ఏడాది మొత్తం ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం తిరిగిన మూవీ టీం, ఇప్పుడు ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నా అవార్డ్స్ ని అందుకునేందుకు కోసం మళ్ళీ కలిసి తిరగాల్సి వస్తుంది..ఇటీవలే ఈ చిత్రం లోని ‘నాటు నాటు’ సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో కీరవాణి కి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మూవీ టీం అమెరికన్ మీడియా తో ఇంటరాక్ట్ అయ్యింది..ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మీడియా తో అమెరికన్ యాసలో మాట్లాడడం అభిమానులకు అద్భుతంగా అనిపించినా, నెటిజెన్స్ కి మాత్రం ట్రోలింగ్ స్టఫ్ అయ్యింది..ఎన్టీఆర్ ఫేక్ యాస తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి..మామూలుగా మాట్లాడితే సరిపోతుంది కదా..ఈ బిల్డప్స్ ఎందుకు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో వచ్చాయి.

ఈ ట్రోల్ల్స్ ఎన్టీఆర్ దృష్టికి కూడా చేరుకుంది..నిన్న జరిగిన ఒక మీడియా సమావేశం లో దీనిపై ఎన్టీఆర్ సమాధానం చెప్తూ ‘మనం ఏ దేశానికీ వెళ్లినా ఆ దేశ భాషా మరియు సంస్కృతి ని గౌరవించడం మన సాంప్రదాయం..ఆ ఉద్దేశ్యం తోనే నేను అమెరికన్ యాసలో మాట్లాడాను కానీ నా తోటి నటీనటులకంటే నేను గొప్ప అనిపించుకోవడానికి కాదు’ అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పాడు.