Junior NTR: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా ట్రోల్స్ హద్దులు దాతుతున్నాయి. చేతిలో మొబైల్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు, ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లోకి దూరడం, తమకు ఇష్టం లేని సెలబ్రిటీలపై నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఫోటోలను మార్ఫింగ్ చేయడం, ఇలా హద్దులు దాటి ఇష్టమొచ్చినట్టు వ్యవహారిస్తున్నారు. అందుకే సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఫోటోలకు, వీడియోలకు భద్రత కోరుతూ హై కోర్టు ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు, సోషల్ మీడియా లో తమ సమాచారం కి భద్రత కోరగా, హై కోర్ట్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు.
సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరచూ ఫ్యాన్ వార్స్ లో ఉంటారు. తమ అభిమాన హీరో ని ట్రోల్ చేస్తే ఏ హీరో అభిమాని ఊరుకోడు కదా, అందుకే ఎన్టీఆర్ పై తిరిగి ట్రోల్స్ వేస్తుంటారు. ఈ క్రమం లో ఈమధ్య కొంతమంది హద్దులు దాటి ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి నేషనల్ వైడ్ గా వైరల్ చేసారు. ఇది ఎన్టీఆర్ టీం ద్వారా ఎన్టీఆర్ దృష్టికి చేరింది. అందుకే ఆయన ఇకమీదట తన వ్యక్తిగత ఫోటోలను భద్రత కలిపించాలి అంటూ ఢిల్లీ హై కోర్టు లో ఎన్టీఆర్ పిటీషన్ వేయగా, 2021 సోషల్ మీడియా నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మశానం ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా ఇప్పటి వరకు ట్రోల్స్ చేసిన నిందితుల జాబితాను వివరంగా ఈ నెల 22 న అందిస్తాము అంటూ ఎన్టీఆర్ తరుపన న్యాయవాది చెప్పుకొచ్చాడు. అదే రోజున ఈ పిటీషన్ పై విచారణ కూడా జరుపనున్నారు. ఇక మీదట ఎన్టీఆర్ మీద హద్దులు దాటి ట్రోల్స్ చేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఊచలు లెక్కపెట్టక తప్పదు.