Genelia viral video: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘జూనియర్'(Junior Movie) అనే చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కనిపిస్తూ ఉంది. అసలు ఎవరు ఈ సినిమాలో హీరో అనే విషయం కూడా అత్యధిక శాతం మంది జనాలకు తెలియదు. ఏంటో వీళ్ళ హడావిడి ఒకసారి హీరో నేపథ్యం ఏంటో చూద్దామని టీజర్, ట్రైలర్ చూస్తే, వామ్మో ఇతను హీరో ఎలా అయ్యడండి బాబు అని సదరు ప్రేక్షకుడికి అనిపించక తప్పదు. దానికి తోడు శ్రీలీల(Sreeleela) హీరోయిన్, ఆమెతో అదిరిపోయే రేంజ్ మాస్ బీట్ సాంగ్ ‘వైరల్ వయ్యారి'(Viral Vayyari) తో స్టెప్పులు వేయించడం తో ఈ సినిమా పై కాస్త హైప్ అయితే పెరిగింది అని చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షో యాప్ లో మొదలు పెట్టారు. ఈ సాంగ్ కారణంగా వచ్చిన హైప్ తో టికెట్స్ అమ్ముడుపోయాయని అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
Also Read: ప్రభాస్ పేరు ప్రస్తావించని జెనీలియా..మండిపడుతున్న అభిమానులు!
ఇంతకు ఈ చిత్రం లో హీరో ఎవరంటే ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి గుర్తున్నాడు కదా, ఈయన పై ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి, అతని కుమారుడే ఇతను. పేరు కిరీటి రెడ్డి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మూవీ లో నటించిన నటీనటులు, పని చేసిన టెక్నీషియన్స్ అందరూ హాజరు అయ్యారు. ఇందులో హీరోయిన్ శ్రీలీల తో పాటు, మన అందరి ఫేవరెట్ హీరోయిన్ జెనీలియా(Genelia Deshmukh) కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ఆరెంజ్ తర్వాత మళ్ళీ ఆమె తెలుగు ఆడియన్స్ కి కనిపించబోతుంది ఈ సినిమా ద్వారానే. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చింది. నిన్న హీరో కిరీటి రెడ్డి(Kireeti Reddy) ఈమెని చూడగానే కాళ్లకు దండం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ కు నిజాం రాజుకు ఏంటి సంబంధం..? చార్మినార్ కథలో ఎందుకు ఉంది?
జెనీలియా వయస్సు కేవలం 37 ఏళ్ళు మాత్రమే. కిరీటి రెడ్డి వయస్సు పాతికేళ్ల వరకు ఉండొచ్చు. వయస్సు తేడా ఉన్నప్పటికీ కూడా కళ్ళకు దండం పెట్టేంత వయస్సు జెనీలియా కి లేదు. కానీ హీరో చాలా అతి వినయం చూపిస్తున్నాడు, అంత అవసరం లేదంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇకపోతే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే విడుదల చేసిన ‘వైరల్ వయ్యారి’ పాట యూత్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ కూడా పర్వాలేదు అనే రేంజ్ ఉంది.