July Tollywood Movies: తెలుగు సినిమాకి ఈ ఏడాది 2022 బాగానే గిట్టుబాటు అయింది. ప్రతి నెల ఏదో ఒక సినిమా రూపంలో హిట్ అందుకుని టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటూనే ఉంది. జనవరి నుంచి జూన్ వరకు ఇది కొనసాగింది. కానీ, ప్రతి నెలలా ఈ నెల లేదు. ఒక్క హిట్ కూడా లేక ప్రస్తుతం బాక్సాఫీస్ విలవిల్లాడుతుంది. జూలైలో ప్లాప్ ల పరంపర ఈ స్థాయిలో విజృభిస్తోందని ఎవ్వరూ ఊహించలేదు.
జూలై 1 న విడుదలైన గోపీచంద్ ’పక్కా కమర్షియల్’ కమర్షియల్ గా భారీ లాస్. అదే రోజు రిలీజ్ అయిన 10th క్లాస్ డైరీస్, షికారు చిత్రాల గురించి చర్చ అనవసరం. ఈ సినిమాలకు పోస్టర్ల డబ్బులు కూడా రాలేదు. మాధవన్ ‘రాకేట్రీ’ కూడా తెలుగులో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. లావణ్య త్రిపాఠి తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా బ్యాడ్ టాక్ తో బాగా డిజప్పాయింట్ చేసింది.
జూలై 14న విడుదలైన రామ్ పోతినేని ‘ది వారియర్’ రూ. 35 కోట్ల బిజినెస్ చేసుకుంది. కానీ.. ఇంకా రూ. 20 కోట్లు కూడా వసూళు చేయలేదు. రూ. 15 కోట్లకు పైగా ఈ సినిమా నష్టాలను మిగిల్చేలా ఉంది. నాగ చైతన్య రాశీ ఖన్నా జంటగా వచ్చిన ‘థాంక్యూ’ పరిస్థితి ఇంకా అద్వానం. ఫస్ట్ డే నుంచి డిజాస్టర్ టాక్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 3.87 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ బిజినెస్ మాత్రం 30 కోట్లు పైనే చేసుకుంది. అంటే.. ఈ సినిమాకి 24 కోట్లు వరకు లాస్.
నిజానికి జూలై నెలలో ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయని అంతా ఆశించారు. కానీ, ఊహించని విధంగా డిజాస్టర్లు అయ్యాయి. ఇప్పటి వరకు జూలైలో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్కటి కూడా కనీస హిట్ టాక్ అందుకోలేకపోయింది. తెలుగు సినిమా బాక్సాఫీస్ కి జూలై గ్రహణం పట్టింది. అసలు హిట్ మాట దేవుడెరుగు.. కనీసం కనీస కలెక్షన్స్ ను కూడా ఏ చిత్రం క్రియేట్ రాబట్టలేకపోయింది.
Also Read: Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?
విచిత్రంగా బాక్సాఫీస్ పూర్తిగా బోసిపోయింది. కొంతమంది డిస్కౌంట్ -టికెట్ స్క్రీమ్ కూడా పెట్టారు. థియేటర్లలో ఆక్యుపెన్సీ మాత్రం పెరగలేదు. సినిమాలో మ్యాటర్ లేకపోతే.. ఎదురు డబ్బులు ఇచ్చినా సినిమా చూడటానికి జనాలు రారు అని తేలిపోయింది. మొత్తమ్మీద జూలై సినిమాలన్నీ పరిపూర్ణంగా వాష్ అవుట్ అయ్యాయి.
అయితే, కష్టకాలంలో ఆశాకిరణంగా కనిపిస్తోంది ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ వారం రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం వైపే టాలీవుడ్ ఆసక్తిగా చూస్తోంది. రవితేజ తన ‘రామారావు ఆన్ డ్యూటీ’తో హిట్ కొట్టి.. టాలీవుడ్ ఆశలని నిలబెడతాడని.. జూలై పరువును నిలబెడతాడని ఆశిద్దాం.
Also Read: Mohan Babu- Chandrababu: హాట్ టాపిక్: చంద్రబాబుతో మోహన్ బాబు భేటి.? కథేంటి?