Devara NTR30 : ఎన్టీఆర్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర కోసం తనని తాను మార్చుకుంటారు. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ లుక్ సాధించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. గంటల తరబడి వర్కవుట్స్ చేశారు. ఇక కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ లావుగా ఉండేవారు. ఓ దశలో ఆయన పూర్తిగా షేప్ అవుట్ అయ్యారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రాఖీ మూవీలో ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ కు జీర్ణించుకోలేరు.
సర్వత్రా విమర్శలు రాగా ఎన్టీఆర్ పూర్తిగా బరువు తగ్గారు. మరలా శరీర పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహార నియమాలు పాటిస్తున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ కష్టపడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎన్టీఆర్ సీరియస్ గా కండలు పెంచుతున్నాడని ఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్నాడు. ఆ మూవీ కోసమే ఎన్టీఆర్ జిమ్ లో కష్టపడుతున్నాడని సమాచారం.
ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని వినికిడి. రెండు పాత్రల మధ్య ఎన్టీఆర్ వ్యత్యాసం చూపించే ఆస్కారం కలదు. ఇక ఎన్టీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని విడుదల చేసిన దేవర ఫస్ట్ లుక్ కేకపుట్టించింది. మాస్ అవతార్ లో ఎన్టీఆర్ సరికొత్తగా ఉన్నారు. చేతిలో ఆయుధం, పంచె కట్టుతో ఆయన గెటప్ ఫ్యాన్స్ అంచనాలు అందుకుంది. 2024 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ నిరవధికంగా పూర్తి చేస్తున్నారు.
దేవర మూవీలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. దేవర అనంతరం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, వార్ 2 చిత్రాలలో నటించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి సెట్స్ పైకి వెళ్లనుంది. వార్ 2 సైతం వచ్చే ఏడాది మొదలుకానుంది. భవిష్యత్ లో ఎన్టీఆర్ నుండి వచ్చే వన్నీ భారీ చిత్రాలే.