Jr NTR Viral Dialogue: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ‘ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు’ గారు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు గొప్ప గుర్తింపు లభించడమే కాకుండా ప్రేక్షకులు అతనికి నీరాజనాలు పట్టారు… ఒక సినిమా హీరో కూడా పాలిటిక్స్ లోకి వచ్చి సీఎం అవ్వచ్చు అని ప్రూవ్ చేశాడు. అలాగే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకువచ్చిన నాయకుడు కూడా తనే కావడం విశేషం…ఇక రాజకీయం అనే పదానికి అర్థాన్ని కూడా మార్చాడు. ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు(Balayya Babu) సైతం మంచి సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆయన సినిమాల ప్రభావం జనాల్లో ఎలా ఉందంటే ఏ పబ్లిక్ ఫంక్షన్ లో అయిన, పార్టీలో అయిన జై బాలయ్య అనే మాట మనకు కామన్ గా వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ తమ ఫంక్షన్స్ కి ఊపు తెప్పించడానికి ‘జై బాలయ్య’ అంటూ అరుస్తారు. దానివల్ల అక్కడున్న వాళ్ళందరూ చాలా యాక్టివ్ అవ్వడమే కాకుండా బాలయ్య పేరు విన్న ఆయన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు.
ఇక బాలయ్య పేరు మనలాంటి ప్రేక్షకులు లేదా అభిమానులు స్లోగన్ గా వాడితే పర్లేదు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), అక్కినేని అఖిల్ (Akhil) లాంటివారు సైతం బాలయ్య స్లోగన్ ను వాడుతూ పార్టీ మూడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: Balayya Babu and NTR : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, అఖిల్ ‘జై బాలయ్య’ అంటూ అరిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా బాలయ్యకు ఇప్పటికి మంచి క్రేజ్ అయితే ఉంది. 65 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ తనకంటూ ఒక మంచి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అయితే దక్కించుకుంటున్నాడు. వరుసగా నాలుగు విజయాలతో తనను తాను కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వరుస సక్సెస్ లతో తన అభిమానులను ఆనందపరుస్తున్నాడు. గత 20 సంవత్సరాల నుంచి ఆయన వరుసగా నాలుగు సక్సెస్ లను ఎప్పుడు అందుకోలేదు. ఈ ఏజ్ లో ఆయన మంచి సక్సెస్ లను సాధించడం చూస్తున్న అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
