నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న యంగ్ టైగర్

నందమూరి హీరోలు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ నటిస్తూనే సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. తమ సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ నిర్మాణరంగంలోనూ రాణిస్తున్నారు. బాలకృష్ణ ‘ఎన్బీకే’ సంస్థను ఏర్పాటు చేయగా కల్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ ఏర్పాటు చేసి మూవీలను నిర్మిస్తున్నారు. తన తండ్రి గుర్తుగా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ఓ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు సన్నహాలను చేస్తున్నట్లు సమాచారం. ‘నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్’ ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించేందుకు యంగ్ టైగర్ ప్లాన్ […]

Written By: Neelambaram, Updated On : March 22, 2020 1:40 pm
Follow us on

నందమూరి హీరోలు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ నటిస్తూనే సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. తమ సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ నిర్మాణరంగంలోనూ రాణిస్తున్నారు. బాలకృష్ణ ‘ఎన్బీకే’ సంస్థను ఏర్పాటు చేయగా కల్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ ఏర్పాటు చేసి మూవీలను నిర్మిస్తున్నారు. తన తండ్రి గుర్తుగా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ఓ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు సన్నహాలను చేస్తున్నట్లు సమాచారం.

‘నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్’ ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించేందుకు యంగ్ టైగర్ ప్లాన్ చేస్తున్నాడు. తన తండ్రి పేరు చిరకాలం నిలిచి ఉండేలా సొంత బ్యానర్ ఏర్పాటు దిశగా సన్నహాలు చేస్తున్నాడు. ఈ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను నిర్మించనునున్నాడు. ఈ బ్యానర్లోనే తన మూవీలను నిర్మించడంతోపాటు కొత్త టాలెంట్ వెలుగులోకి తెచ్చేందుకు నిర్మాతగా మారనున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్, రాంచరణ్ సొంతంగా బ్యానర్లు ఏర్పాటు చేసుకొని మూవీలను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. వీరంతా చిత్ర నిర్మాణంలో భాగస్వాములై లాభాల్లో వాటాను తీసుకుంటున్నారు.

యంగ్ టైగర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. అలాగే కల్యాణ్ నిర్మించబోయే మూవీలో నటించనున్నాడు. వీటి తర్వాత ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి మూవీలను నిర్మించున్నట్లు తెలుస్తోంది.