https://oktelugu.com/

చరణ్ కు సారీ చెప్పిన ఎన్టీఆర్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెల్సిందే. శుక్రవారం రాంచరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించాడు. అయితే అనుకున్న సమయానికి రాంచరణ్ కు ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇవ్వలేదు. దీంతో రాంచరణ్ సారీ అని చెబుతూనే జక్కన్న పనితీరుపై సెటైర్ వేయడం ఆకట్టుకుంది. ఇందుకు ప్రతీగా చెర్రీ కూడా సరదా స్పందించారు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం […]

Written By: , Updated On : March 27, 2020 / 12:18 PM IST
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెల్సిందే. శుక్రవారం రాంచరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించాడు. అయితే అనుకున్న సమయానికి రాంచరణ్ కు ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇవ్వలేదు. దీంతో రాంచరణ్ సారీ అని చెబుతూనే జక్కన్న పనితీరుపై సెటైర్ వేయడం ఆకట్టుకుంది. ఇందుకు ప్రతీగా చెర్రీ కూడా సరదా స్పందించారు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెర్రీ జన్మదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో చెర్రీ ఫస్ట్‌లుక్‌ను ఎన్టీయార్ విడుదల చేసి సర్ ప్రైజ్ ఇస్తాడని అందరు భావించారు. ఉదయ10గంటలకు చెర్రీకి గిప్ట్ ఇస్తానని గతంలోనే ఎన్టీఆర్ ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ రాలేదు. దీంతో ఎన్టీఆర్ ‘సారీ బ్రదర్ చరణ్.. రాజమౌళి అభిప్రాయం తెలుసుకుందామని నీ గిఫ్ట్‌ను నేను ఆయనకి పంపించాను.. జక్కన్న సంగతి నీకు తెలుసు కదా.. చిన్న ఆలస్యం’ అంటూ ఎన్టీయార్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు చరణ్ స్పందిస్తూ ‘ఏంటి ఆయనకి పంపించావా..? ఈ రోజుకి వస్తుందా’ అంటూ సరదాగా వ్యాఖ్యనించాడు. దీనికి స్పందించిన ఎన్టీయర్ ‘ఇప్పుడే రాజమౌళితో మాట్లాడాను.. సాయంత్రం 4గంటలకు కచ్చితంగా ఇస్తానని’ చెప్పినట్లు సమాధానమిచ్చాడు. దీంతో ఎన్టీఆర్ చరణ్ కు ఇచ్చే సర్ ప్రైజ్ గిప్ట్ కోసం మరికొంత సమయం వేచి చూడక తప్పేలా లేదు.

ఉగాది రోజున దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్లోనే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ అని ప్రకటించాడు. ఈ మోషన్ పోస్టర్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కనువిందుగా ఉందని కామెంట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని 2021 జనవరి 8న విడుదల చేసేందుకు చిత్రబృదం సన్నహాలు చేస్తుంది.