RRR Naatu Naatu Video Song: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ మాత్రమే కాదు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ థ్రిల్ అయిపోయారు. అసలు ఈ సినిమా రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అయ్యారు. అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి చేసిన ‘నాటు నాటు’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

కాగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ క్రేజీ సాంగ్ మాస్ యాంథమ్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ పాటను రీక్రియేట్ చేస్తూ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.
ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ వీడియో సాంగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ నాటు నాటు సాంగ్ లో అసలు గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేయలేదు ఏమో అనిపించే స్థాయిలో తారక్ – చరణ్ స్టెప్స్ వేశారు. ఆర్ఆర్ఆర్ గొప్ప విజయం వెనుక ఈ సాంగ్ కూడా ఓ ప్రధాన కారణం.
Also Read: RRR 18 Days Collections: RRR 18 రోజుల కలెక్షన్లు
అందుకే.. ఈ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కీరవాణి అందించిన మ్యూజిక్ కూడా టాప్ లో ఉంది. దర్శకుడు రాజమౌళితో పాటు మిగతా టీమ్ కూడా అద్భుతంగా పని చేశారు. అందుకే మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 17 రోజులకు గానూ 562.08 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 17 రోజులకు గానూ రూ. 1027 కోట్లను కొల్లగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చిన ఈ కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.
Also Read: RRR 17 Days Collections : కలెక్షన్ల ప్రవాహం ఇంకా ఆగలేదు !
![Naatu Naatu Full Video Song (Telugu) [4K] | RRR | NTR,Ram Charan | MM Keeravaani | SS Rajamouli](https://i.ytimg.com/vi/OsU0CGZoV8E/hqdefault.jpg)