Jr NTR Prashanth Neel movie : తెలుగు సినిమా ఇండస్ట్రిలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాయి. దేవర సినిమాతో 600 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్ల మార్కును అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే పర్లేదు కానీ ఒకవేళ తేడా కొడితే మాత్రం ఆయన మార్కెట్ మరింత తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ విపరీతంగా కష్టపడుతున్నాడు. ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగానే ముందుగా ఒక మేకవర్లో రెడీ అయిపోయిన ఎన్టీఆర్ ఆ లుక్ అంత పర్ఫెక్ట్ గా లేదని ఇప్పుడు మరో లుక్కు కోసం విపరీతంగా ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు.
మరి ఈ సినిమా ఆయన్ని ఏ రేంజ్ హీరోగా నిలబెడుతుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న… ప్రశాంత్ నీల్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతాడా లేదా అనే అంటు ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ గాని, పోస్టర్ గాని రాలేదు. కారణమేదైనా కూడా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలైతే వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తూ పెద్ద తప్పు చేస్తున్నాడు అంటూ అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు…
ప్రశాంత్ నీల్ ఇంతకుముందు చేసిన కేజిఎఫ్ సిరీస్, సలార్ లాంటి సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ను ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య సినిమాకి సంబంధించిన క్లాశేష్ అయితే వస్తున్నాయి. వాటిని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…