NTR Prashanth Neel Dragon Movie Update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా స్టార్ట్ అయి సంవత్సరన్నార దాటుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కానీ, టీజర్ కానీ ఏది రిలీజ్ చేయలేదు. కారణమేంటి అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రశాంత్ నీల్ చాలా ఎక్కువ రోజుల పాటు సినిమాలను చిత్రీకరిస్తున్నాడు. కారణం ఏంటి కథ విషయంలో ఆయనకు క్లారిటి లేదా సినిమా సగం షూట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా కథను ఇంకా మారుస్తున్నారా? అనే విషయం మీద కూడా సరైన క్లారిటి రావడం లేదు. మొత్తానికైతే ఎన్టీఆర్ ఈ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
ఆ ఆశాలను నెరవేరుస్తూ ప్రశాంత్ నీల్ భారీ సక్సెస్ ని కట్టబెడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు భారీ రికార్డులను కొల్లగొట్టే సినిమాలైతే చేయలేదు.
కాబట్టి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ సినిమా అయిన ఆయన కోరికను నెరవేరుస్తుందేమోనని చూస్తుంటే అది కూడా క్లారిటీ రావడం లేదు. ఈ సినిమా విషయంలో కూడా ప్రశాంత్ నీల్ లేట్ చేస్తుండడం వల్ల ప్రేక్షకులు విసిగిపోతున్నారు. ఇక దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. మొత్తానికైతే తన మేకోవర్ విషయంలో గాని, డూప్ లేకుండా స్టంట్స్ చేయడంలో కానీ ఆయన చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ను ఇవ్వకపోవడమే కాకుండా సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో కూడా చెప్పడం లేదు. దాని వల్ల ఈ సినిమా అసలు ఏం జరుగుతుంది? ఈ సినిమాను ఎందుకని అంత రహస్యంగా తెరకెక్కిస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి…