Jr NTR In Oscar Race: తెలుగు నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ అందరికి తెలిసిందే. నందమూరి కుటుంబ వారసుడిగా అరంగేట్రం చేసిన ఎన్టీఆర్ తనదైన టాలెంట్ తో నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. పాత్రల ఎంపికలో వైవిధ్యం నటనలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పాత్రలో జీవించే ఎన్టీఆర్ నటన గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి హరికృష్ణ తనయుడిగా ఎన్టీఆర్ తన నటన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అన్న కల్యాణ్ రామ్ కూడా నటనలో రాణిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో చూపిన ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా చూసిన వారందరు ఎన్టీఆర్ నటనకు జై కొట్టారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన అనన్యమైనదిగా అందరు అభివర్ణించారు. దీంతో ఎన్టీఆర్ నటన ఆస్కార్ దృష్టిని ఆకర్షించడం విశేషం. ఆసియా నుంచి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ నే ఉండటం విశేషం. అమెరికాలోని ప్రముఖ మూవీ పబ్లికేషన్ ఉత్తమ నటులకు ఇచ్చే అవార్డు కోసం కూడా ఎన్టీఆర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటన అందరిని అబ్బురపరచింది. కొమరం భీం పాత్రలో ఒదిగిపోయిన ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.
Also Read: Victory Venkatesh: విక్టరీ వెంకటేశ్ @ 36 ఇయర్స్ ఇండస్ట్రీ.. వెంకీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు !
ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. అతడి నటనలో ఎంతో విశిష్టత ఉండటం తెలిసిందే. అందుకే ఆసియా నుంచి ఒకే నటుడు ఆస్కార్ రేసులో ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ నటనకు అందరు ప్రశంసలు కురిపించిన విషయం విధితమే. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో నటనను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అతడి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటనలో తనదైన శైలిలో డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ కు సాటి ఎవరు లేరనేది అందరికి తెలిసిన విషయమే.
సినిమా సినిమాకు ఎన్టీఆర్ లో నటన విశ్వరూపం మారుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. దీన్ని అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించడం గమనార్హం. తెలుగువారికి ఆస్కార్ అవార్డు కోసం అవకాశం రావడం గొప్ప విషయమే. ఇప్పటికే బాహుబలి ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు అంతటి గుర్తింపు రావడానికి కారణమయ్యారని పలువురు చెబుతున్నారు.