
కొవిడ్-19 నిరోధం కోసం ఉపయోగించే మాస్క్ రేటు ఎంత ఉంటుంది? చాలా మందికి 10 రూపాయల నుంచి మొదలయ్యే సాధారణ మాస్క్ నుంచి రూ.250 వరకు ఉండే ఎన్-90 రేంజ్ మాస్క్ వరకు తెలుసు. కానీ.. అంతకు మించిన మాస్కులు కూడా ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యూజ్ చేస్తున్న మాస్క్ రేటు హైరేంజ్ లో ఉంది.
Also Read: ఫిబ్రవరి రివ్యూః వెండితెర వెలిగిందా..?
ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఫంక్షన్ కు టాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. ఇక, సుక్కూతో వర్క్ చేసిన హీరోలు, హీరోయిన్లు దాదాపుగా వచ్చేశారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగ చైతన్య మాత్రం ఫ్యామిలీతో వచ్చేశారు.
ఈ సందర్భంగా.. వైట్ షర్ట్ – బ్లాక్ ప్యాంట్, ఫార్మల్ షూతో యంగ్ టైగర్ సింపుల్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఈ వేడుకకు మాస్క్ తో హాజరయ్యాడు తారక్. దీంతో.. ఎన్టీఆర్ ధరించిన బ్లాక్ మాస్క్ చర్చనీయాంశమైంది. అది యూఏ స్పోర్ట్స్ మాస్క్. దీని ధర అక్షరాలా రూ.2, 340! ఈ మాస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఈ మాస్క్ పెట్టుకున్నాడని.. కొందరు అభిమానులు ఇప్పుడు ఇదే మాస్క్ కొనుగోలు చేస్తున్నారు.
కాగా.. ఇటీవల తారక్ HERMES బ్రాండ్ షూస్‌తో కనిపించాడు. ఇది గమనించిన ఫ్యాన్స్ ఆ షూస్ గురించి ఆరాతీశారు. ఆన్‌లైన్లో సెర్చ్ చేస్తే.. ఆ షూ కాస్ట్ రూ. 75 వేలుగా కనిపించింది. ఈ విధంగా అటు ఖరీదైన షూస్ తో, ఇటు విలువైన మాస్క్ తో చర్చల్లో నిలిచాడు తారక్.
Also Read: ‘మడ్డీ’ టీజర్ టాక్: బురదరోడ్డులో ఫైట్ ఉత్కంఠభరితం
ఇక, సినిమాల విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ రాబోతోంది. అయితే.. ఈ గ్యాప్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరించబోతున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చెయ్యనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్