Homeఎంటర్టైన్మెంట్చిన్న ఎన్ టి ఆర్ పెద్ద ఆలోచనలు

చిన్న ఎన్ టి ఆర్ పెద్ద ఆలోచనలు


ప్రస్తుతం ” రౌద్రం రణం రుధిరం ” చిత్రం చేస్తూ బిజీ గా ఉన్న చిన్న ఎన్ టి ఆర్ , ఈ చిత్రం తరవాత చేయబోయే చిత్రాలను నెమ్మదిగా లైన్లో పెడుతున్నాడు .తారక్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుంచి విముక్తి కాగానే ముందు తన అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ గా ఉన్నాడు . అరవింద సమేత వంటి వైవిధ్య మైన చిత్రాన్ని అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి తారక రాముడ్ని చక్కటి కుటుంభం కథా చిత్రంలో చూపించాలని అనుకొంటున్నాడట… కాగా ఈ చిత్రం చక్కటి ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ మార్క్ కామెడీతో ఉండబోతుందని తెలుస్తోంది. అదలావుంటే ఆ చిత్రం తరవాతి చిత్రం కూడా ఒక స్టార్ డైరెక్టర్ నేతృత్వం లో ఉండ బోతుందట….

ఎన్ టి ఆర్ తో ” జనతా గ్యారేజ్ ” చిత్రం తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొరటాల శివ మరో మారు తారక్ తో జట్టు కట్ట బోతున్నాడు. కొరటాల శివ మాటల రచయితగా ఎన్ టి ఆర్ నటించిన బృందావనం చిత్రానికి పనిచేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత స్టార్ దర్శకుడిగా ఎదిగిన తరవాత `జనతా గ్యారేజ్ ` చిత్రం చేయడం జరిగింది. అదికూడా సూపర్ హిట్ అయ్యింది. అలా బలపడిన వారి బంధాన్ని ఇపుడు మరో చిత్రం తో ముందుకు తీసుకెళ్ల బోతున్నారు.

కొర‌టాలశివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తరువాత ఎన్టీయార్‌ తో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. 2021లో మొదలయ్యే ఈ చిత్రానికి కథ కూడా రెడీ అయిందని తెలుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular