https://oktelugu.com/

JR NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు’ ఆల్​టైమ్​ రికార్డు సెట్​ చేసిన తారక్​

JR NTR: యంగ్​టైగర్ ఎన్టీఆర్​ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇందులో రామ్​చరణ్  కూడా హీరోగా కనిపించనున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే వేరేలెవెల్​లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, పాటలు ప్రేక్షకులను కట్టిపడేయగా.. ఇటీవలే వచ్చిన ట్రైలర్​ ఒక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారీ ప్రమోషన్స్​ ప్లాన్ చేశారు రాజమౌళి. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 12:50 PM IST
    Follow us on

    JR NTR: యంగ్​టైగర్ ఎన్టీఆర్​ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇందులో రామ్​చరణ్  కూడా హీరోగా కనిపించనున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే వేరేలెవెల్​లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, పాటలు ప్రేక్షకులను కట్టిపడేయగా.. ఇటీవలే వచ్చిన ట్రైలర్​ ఒక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారీ ప్రమోషన్స్​ ప్లాన్ చేశారు రాజమౌళి.

    JR NTR

    Also Read: అల్లు అర్జున్ రీల్ హీరో కాదు, రియల్ హీరో !

    కాగా, మరోవైపు తారక్​ సిల్వర్​ స్క్రీన్​పైనే కాకుండా.. బుల్లితెరపైనా ప్రేక్షకులను పలకరిస్తూ.. వారి కుటుంబంలో ఒకరిగా నిలిచిపోయారు. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్​బాస్​కి హోస్ట్​గా పరిచయమై.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు తో అలరిస్తున్నారు. అయితే, ఈ షోకి కూడా తనదైన స్టైల్​లో రికార్డు స్థాయిలో రేటింగ్​ను రాబట్టాడు తారక్​.

    అంతే కాకుండా.. ఈ షో ముగింపుతో అసలు ఈ ఫ్రాంచైజీలోనే అధిక యావరేజ్​ రేటింగ్​ను నమోదైనట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇప్పటి వరకు జరిగిన ఈ షో ఎపిసోడ్స్​ రేటింగ్స్​తో కలిసి యావరేజ్​గా 4.04 రేటింగ్ వచ్చిందట. ఈ షో ఫ్రాంచైజ్​లోనే ఆల్​టైమ్ రికార్డుగా తెలుస్తోంది. దీనంతటికీ కారణం తారక్​ అనే చెప్పాలి. అతని మాటశైలి, యాక్టీవ్​ పర్సనాలిటీయే.. షోను ఇంత దూరం నడిపించిందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

    Also Read: చెక్​బౌన్స్​ కేసులో కోర్టు మెట్లెక్కిన హీరో సుమంత్​