ఎన్టీఆర్ ‘ఐదు కోట్ల కారు’ ఆమె కోసమే !

ఎన్టీఆర్ ఇటాలియన్ లగ్జరీ కారు Lamborghini Urusని కొన్నాడని, ఆ కారు త్వరలోనే హైదరాబాద్ కి వచ్చేస్తోందని.. ఆ తరువాత వచ్చేసింది అంటూ రీసెంట్ గా వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే , ఇంతకీ ఎన్టీఆర్ ఆ కారు కొన్నది ఒకామె కోసమని తెలుస్తోంది. దాదాపు ఐదు కోట్లు విలువ చేసే కార్ ను ఎన్టీఆర్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే.. ఆమె ఎవరై ఉంటారు అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. కాగా ఎన్టీఆర్ ‌ […]

Written By: admin, Updated On : March 20, 2021 6:16 pm
Follow us on


ఎన్టీఆర్ ఇటాలియన్ లగ్జరీ కారు Lamborghini Urusని కొన్నాడని, ఆ కారు త్వరలోనే హైదరాబాద్ కి వచ్చేస్తోందని.. ఆ తరువాత వచ్చేసింది అంటూ రీసెంట్ గా వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే , ఇంతకీ ఎన్టీఆర్ ఆ కారు కొన్నది ఒకామె కోసమని తెలుస్తోంది. దాదాపు ఐదు కోట్లు విలువ చేసే కార్ ను ఎన్టీఆర్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే.. ఆమె ఎవరై ఉంటారు అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. కాగా ఎన్టీఆర్ ‌ తన తల్లి ‘షాలిని’ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: అయ్యో.. ప్లాప్ హీరోకి ఇరవై కోట్లు నష్టం !

కారు రిజిస్ట్రేషన్ ను కూడా షాలిని పేరు మీదే చేయించాడట తారక్. మొత్తానికి తన తల్లికి విలువైన బహుమతిని ఎన్టీఆర్ ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఈ కారులోనే ప్రయాణం చేస్తోందట. నిజానికి షాలిని ఎక్కువుగా బయటకు రారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లు తప్పితే ఆమె కనిపించేది చాలా అరుదు. ఇక ఈ కారు ఇటీవలే ఎన్టీఆర్ ఇంటికి చేరుకుంది. పైగా ఇలాంటి కారు హైదరాబాద్ లో ఎవరికీ లేదట. అందుకే ఎన్టీఆర్ మోజుపడి ఈ కారును తెప్పించాడు.

Also Read: ఎదిగే కొద్దీ సొంత మనుషుల మధ్యే పోటీ !

ఏది ఏమైనా సినిమా స్టార్స్ కి ఖరీదైన కార్లు కొనడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రతి హీరోకి ఇలాంటి ప్రతేకమైన వెహికల్స్ నాలుగైదు ఉన్నాయి. అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు. మొదటినుండి ఎన్టీఆర్ లగ్జరీ ఫీచర్లతో పాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం తారక్ జెమినీ టీవీ ప్రసారం చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని మూడు నెలల పాటు హోస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అలాగే ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్