https://oktelugu.com/

Jr NTR: ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళా…హైకోర్టుకు వెళ్లిన యంగ్ టైగర్.. మ్యాటరేంటంటే..?

ఎన్టీఆర్ హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరమైతే వచ్చింది. ఇక దీనికి గల కారణం ఏంటి అంటే 2003 వ సంవత్సరంలో గీత లక్ష్మీ అనే మహిళ...

Written By:
  • Gopi
  • , Updated On : May 17, 2024 / 12:57 PM IST

    Jr NTR Approached High Court

    Follow us on

    Jr NTR: యంగ్ టైగర్ గా తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్… ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తు మంచి దూకుడు మీద ఉన్నాడు. ఇక అందులో భాగంగానే దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాల మీద ఇండస్ట్రీలో చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి.

    ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా 1200 కోట్లు కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. కాబట్టి ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాలు కాబట్టి వీటి మీద ఆటోమేటిగ్గా పాన్ ఇండియాలో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాలను తీర్చిదిద్దుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి తన స్టామినా ఏంటో ఇండియా వైడ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరమైతే వచ్చింది. ఇక దీనికి గల కారణం ఏంటి అంటే 2003 వ సంవత్సరంలో గీత లక్ష్మీ అనే మహిళ దగ్గర ఎన్టీఆర్ ఒక ల్యాండ్ అయితే కొన్నాడు.

    ఇక దానికి సంబంధించిన కేసు విషయంలో తను కోర్టుకు రావాల్సిన అవసరమైతే వచ్చింది. అయితే 1996వ సంవత్సరంలోనే గీతా లక్ష్మీ అనే ఆవిడ ఈ ల్యాండ్ ను ‘మార్ట్ గెజ్’ చేసి బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ మార్ట్ గేజ్ డూప్లికేట్ ఫామ్స్ తో ఆమె మరిన్ని బ్యాంకులలో కూడా లోన్లు తీసుకుంది. అయితే ఎన్టీఆర్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒక బ్యాంకులోనే తనకి లోన్ ఉన్నట్టుగా తెలియజేసింది. అందువల్ల ఎన్టీఆర్ ల్యాండ్ ను తీసుకున్నాడు. ఇక ల్యాండ్ తీసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఆ ల్యాండ్ మీద ఇతర బ్యాంకుల్లో కూడా మీద లోన్లు ఉన్నాయట.

    అప్పట్లో ఆయా బ్యాంకులా మేనేజర్లు ఆ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవాలని చూశారు. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ ఆయా మేనేజర్ల పైన కేసులు పెట్టాడు. ఇక ఆ ల్యాండ్ కి సంబంధించి ఇప్పుడు డిఆర్టీ రావడంతో ఎన్టీయార్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరమైతే వచ్చింది…