NTR- Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తీసిన తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబందించి చిన్న మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసాడు..ఈ వీడియో లో సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది..ఆచార్య సినిమా ఔట్పుట్ చూసి ఇతనితో మా హీరో సినిమా చేస్తున్నాడా అని భయపడిన ఎన్టీఆర్ అభిమానులకు ఈ వీడియో కాస్త ఊరటని ఇచ్చింది..కానీ గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త అభిమానులను కంగారు పెడుతుంది..అదేమిటి అంటే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం కావాల్సి ఉంది..కానీ పరిస్థితి చూస్తుంటే ఆగష్టు లో కూడా ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేలా కనిపించడం లేదు.
దానికి కారణం ఈ సినిమా కి సంబంధించిన సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి ఏ మాత్రం నచ్చలేదట..ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ బాగానే వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ ఎలాంటి హై మూమెంట్స్ మరియు ఎలేవేషన్ సీన్స్ లేకుండా రాసాడట కొరటాల శివ..ఇటీవలే స్క్రిప్ట్ మొత్తాన్ని వినిపించగా ఎన్టీఆర్ తన అసంతృప్తి ని వ్యక్తపరిచి, వెంటనే సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ని మార్చమని చెప్పాడట..దీనితో ఇప్పుడు కొరటాల శివ డైలామా లో పడినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Prashanth Neel – NTR: పాకిస్థానీగా నటిస్తున్న ఎన్టీఆర్.. ఇది ఇండియాకే గర్వకారణం
ఒక పక్క ఆచార్య కి వచ్చిన నష్టాలను డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వలేక సతమతమవుతున్న కొరటాల శివ, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ వర్క్ లో తడబాటు పడుంటుండం చూసి, ముందు నీ ఆర్ధిక సమస్యలు అన్ని పూర్తి చేసుకొని స్క్రిప్ట్ డెవలప్ చెయ్..అప్పుడు నా దగ్గరకి రా సినిమా చేద్దాం అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది..మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు #RRR సినిమా విడుదల అయ్యి వంద రోజులు కూడా పూర్తి చేసుకున్న తర్వాత కూడా తమ హీరో కొత్త సినిమాకి సంబంధించిన ఎలాంటి వార్త రాకపోవడం పై తీవ్రమైన అసహనం తో ఉన్నారు..మరో పక్క ఇంకో #RRR హీరో రామ్ చరణ్ మాత్రం సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ప్రారంబించి అప్పుడే 70 శాతం పూర్తి చేసినట్టు తెలుస్తుంది..కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరుకు కనీసం తన కొత్త సినిమా కి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా ప్రారంబించకపోవడం పై అభిమానులు సోషల్ మీడియా లో కొరటాల శివ పై నిప్పులు చెరుగుతున్నారు.
Also Read:Ram- Balakrishna: బాలయ్యకి సినిమాని సెట్ చేసిన హీరో రామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Jr ntr and koratala movie update ntr is unhappy with the second half koratala shiva is confused
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com