Jr NTR Movies: ఎన్టీఆర్ ఆ 3 బ్లాక్ బ్లస్ట‌ర్లు అక్కడ అతి పెద్ద డిజాస్టర్లు.. కారణమిదే !

Jr NTR Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి ఫస్ట్ ఊపిరి పోసిన సినిమా స్టూడెంట్ నెం 1. ఈ సినిమా కారణంగానే ఎన్టీఆర్ అనే హీరో ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది. ఇక ఎన్టీఆర్ కి స్టార్ డమ్ తెచ్చిన సినిమా ఆది. ఈ సినిమా ఎన్టీఆర్ కే కాదు, వినాయక్ కి కూడా లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ లైఫ్ నే మార్చిన సినిమా సింహాద్రి. రాజమౌళికిని స్టార్ డైరెక్టర్ ను చేసిన సినిమా […]

Written By: Shiva, Updated On : January 4, 2022 1:16 pm
Follow us on

Jr NTR Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి ఫస్ట్ ఊపిరి పోసిన సినిమా స్టూడెంట్ నెం 1. ఈ సినిమా కారణంగానే ఎన్టీఆర్ అనే హీరో ఉన్నాడని ప్రపంచానికి తెలిసింది. ఇక ఎన్టీఆర్ కి స్టార్ డమ్ తెచ్చిన సినిమా ఆది. ఈ సినిమా ఎన్టీఆర్ కే కాదు, వినాయక్ కి కూడా లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ లైఫ్ నే మార్చిన సినిమా సింహాద్రి. రాజమౌళికిని స్టార్ డైరెక్టర్ ను చేసిన సినిమా కూడా ఇదే. ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ సినీ కెరీర్ కి చాలా కీలకం. తారక్ స్టార్టింగ్ సినీ జర్నీలో ఈ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి.

Jr NTR

అయితే, ఇవే సినిమాల‌ను త‌మిళ్ లోకి డ‌బ్ చేసి అక్క‌డి హీరోల‌తో భారీ స్థాయిలో భారీ అంచనాలతో నిర్మిస్తే.. డిజాస్టర్లు అయ్యాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఎన్టీఆర్ కి ఈ కథలు సెట్ అయినట్లు అక్క‌డి తమిళ హీరోలకు సెట్ కాలేదు. పైగా ఎన్టీఆర్ కథను డ్రైవ్ చేసినట్లు తమిళ హీరోలు కథను న‌డిపించ‌లేక‌పోయారు. పైగా మన తెలుగు తనానికి ఇక అక్క‌డి తమిళ నేటివిటీకి ఈ క‌థలు కరెక్ట్ గా సింక్ అవ్వలేదు. దాంతో ఈ సినిమాలు తమిళ ప్రేక్షకులకు అంత‌గా న‌చ్చ‌లేదు. అయితే, నచ్చకపోవడానికి డైరెక్ష‌న్ ఫెయిల్యూర్స్ కూడా ఓ కారణం.

ఇంతకీ ఎన్టీఆర్ సినిమాలను తమిళంలో చేసి ప్లాప్లు అందుకున్న ఆ హీరోలు ఎవరో చూద్దాం!

స్టూడెంట్ నెం 1:

రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన ఈ స్టూడెంట్ నెం.1 సినిమా తెలుగులో సూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే, ఇదే క‌థ‌ను శిబిరాజ్ హీరోగా తమిళంలో గ్రాండ్ గా రిమేక్ చేస్తే.. అక్క‌డ అట్ల‌ర్ ప్లాఫ్ అయింది. తమిళ డైరెక్టర్ సెల్వా. ఇతను రాజమౌళి లాగా గొప్పగా సినిమాని హ్యాండిల్ చేయలేకపోయాడు.

Also Read: ఆ ఇమేజ్ కోసం 200 కోట్లు వదులుకున్న ఎన్టీఆర్ !

ఆది :

వివి వినాయ‌క్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మాస్ సినిమా అప్పట్లో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసిందనే క్రెడిట్ ను కూడా దక్కించుకుంది. అయితే, ఈ సినిమా క‌థ‌ను తమిళంలో ప్ర‌శాంత్ హీరోగా చేశారు. జై అనే పేరుతో తమిళంలో రిలీజ్ అయింది. కానీ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాని తమిళంలో నారాయ‌ణ్ డైరెక్ట్ చేశాడు.

సింహాద్రి :

రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సెన్సేష‌న‌ల్ సినిమా హిట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే, తమిళంలో ఈ సినిమాని అక్కడ స్టార్ హీరో విజ‌య‌కాంత్ హీరోగా చేశారు. గ‌జేంద్ర‌ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. కానీ సినిమా డిజాస్టర్ అయింది. డైరెక్ట‌ర్ సురేష్ కృష్ణ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

Also Read: ప్రభాస్ 3.. బన్నీ 2.. లెక్క సరి చేద్దామనుకున్న ఎన్టీఆర్, చరణ్ ఆశలపై నీళ్లు

Tags