Director Devashish Makhija: సినిమా మీద ఇంట్రెస్ట్ తో చాలామంది దర్శకనిర్మాతలు సినిమాలను తీస్తూ ఉంటారు. కొంతమందికి సినిమాల వల్ల అధికమైన లాభాలు వస్తే, మరి కొంతమందికి మాత్రం నష్టాలు వస్తాయి. ఇక ఇండస్ట్రీ లో సినిమాకి పెట్టిన డబ్బులు కూడా రాక అప్పుల పాలై సర్వస్వం కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కోన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి కోవకు చెందిన దర్శకుడే దేవాశిక్ మఖిజా..ఈయన రీసెంట్ గా మనోజ్ వాజ్ పాయ్ ని పెట్టి తీసిన ‘జోరమ్ ‘ సినిమా విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది.
కానీ డబ్బులను మాత్రం కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినప్పటికీ ప్రస్తుతం నా దగ్గర ఇంటి అద్దె కట్టుకోవాడానికి కూడా డబ్బులేవని చెప్పాడు’. అలాగే తనకంటూ ఒక సొంత సైకిల్ని కూడా కొనుక్కోలేని పరిస్థితిలో నేనున్నాను అంటూ చెప్పడం నిజంగా బాధను కల్గించే విషయం…ఇక తను ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అవుతుందని 20 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయన మాత్రం సంపాదించింది ఏమీ లేదని చెప్తూ తన ఆవేదనకు వ్యక్తం చేశాడు.
అలాగే ఇండస్ట్రీలో ఉన్నంత సేపు సినిమా మాత్రమే కాకుండా తమ ఆర్థిక పరిస్థితులను కూడా కాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు సాగాలని ఆ విషయం నాకు చాలా లేటుగా తెలిసిందని కూడా చెప్పాడు…ఇక ఇండస్ట్రీకి షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా పరిచయమైన ఈయన 2017లో ‘అజ్జి’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకున్నప్పటికీ డబ్బులు మాత్రం రాబట్టలేకపోయింది.
ఇక అలాగే ఇప్పుడు ఆయన దగ్గర 20 స్క్రిప్ లు ఉన్నాయని తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ లని తెరమీదకి తీసుకెళ్లడానికి ప్రొడ్యూసర్లు కావాలని కొంతమంది ముందుకు వస్తే తను ఇంకా మంచి సినిమాలను చేయగలనని చెబుతూనే తన ఆర్థిక పరిస్థితిని కూడా తెలియజేయడం విశేషం…