Johnny Master: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చి ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఎన్నో అవమానాలను ఎదురుకోవాలి,ఎన్నో కష్టాలను అనుభవించాలి, ఆకలితో బ్రతకాలి, ఇలా ఎన్నో ఉంటాయి. అన్ని కష్టాలను అనుభవించిన తర్వాత కూడా సక్సెస్ వస్తుందో లేదో చెప్పలేము. అలాంటి పరిస్థితులలో కూడా సక్సెస్ ని సాధించి నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారిలో ఒకరు జానీ మాస్టర్. ఒకప్పుడు ఈయన ప్రముఖ కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ గ్రూప్ లో ఒకడిగా కొనసాగేవాడు. ఆ తర్వాత ఇతనిలో టాలెంట్ ని గుర్తించి కొరియోగ్రాఫర్ గా అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు మన స్టార్ హీరోలు. అలా మొదలైన జానీ మాస్టర్ సినీ ప్రస్థానం నేడు పాన్ ఇండియన్ రేంజ్ కి ఎదిగింది. స్టార్ హీరోలందరూ జానీ మాస్టర్ ని తమ సినిమాలకు పెట్టుకుంటున్నారు. ఆయన అద్భుతమైన ప్రతిభ ని గుర్తించి భారత ప్రభుత్వం రెండు సార్లు నేషనల్ అవార్డుని కూడా అందించింది.
కెరీర్ లో నేటి తరం కొరియోగ్రాఫర్స్ చూడని పీక్ స్థాయిని చూస్తున్న జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం. ఒక స్త్రీ పట్ల ఆయన అసభ్య ప్రవర్తన కారణంగా పోస్కో కేసు లో అరెస్ట్ అయ్యాడు. నిజానిజాలు తేలితే జానీ మాస్టర్ కి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బంగారం లాంటి సినీ కెరీర్ ఒక్క దెబ్బతో మటాష్. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది. జానీ మాస్టర్, శ్రేష్టి వర్మ లవ్ స్టోరీ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. జానీ మాస్టర్ ఢీ షో కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవాడు. ఆ షోలో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెడుతుంది శ్రేష్టి వర్మ. ఆమెని చూసిన తొలిచూపులోనే జానీ మాస్టర్ ప్రేమలో పడిపోయాడట. దాంతో ఆమెని తన టీం లోకి తీసుకొని సుమారుగా నాలుగేళ్ల వరకు అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మీద ఇష్టంతో ఎలాగో అలా ఆమెని దగ్గర చేసుకున్నాడు. కానీ వీళ్ళ మధ్య ఎదో సంఘటన జరిగింది.
శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ కి బ్రేకప్ చెప్పి ఆయన టీం నుండి బయటకి వెళ్ళిపోయింది. అక్కడితో జానీ మాస్టర్ ఆ అమ్మాయి ని వదిలేసి ఉండుంటే, ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు, కానీ జానీ మాస్టర్ ఆమెని వదలలేదు. పెళ్లి చేసుకోమని వేధించాడట. ఆమెకి పెళ్ళైన విషయం తెలిసి కూడా ఇలా ప్రవర్తించేలోపు ఆ అమ్మాయి విసిగిపోయింది. శ్రేష్టి వర్మ ధ్యాసలో పడి జానీ మాస్టర్ భార్య ఇలాగే వదిలేస్తే పిచ్చోడు అయ్యేలా ఉన్నాడని, ఆయనకి మద్దతుగా నిల్చి శ్రేష్ఠిని పెళ్లి చేసుకోమని బలవంతం చేసేడట. ఇక టార్చర్ ని భరించలేక శ్రేష్టి వర్మ ఇండస్ట్రీ పెద్దల సహాయంతో పోలీస్ కేసుని నమోదు చేయించింది. దీంతో జానీ మాస్టర్ కి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఆయన కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అనుకోవాలి, ఎందుకంటే శ్రేష్టి వర్మ మైనర్ వయస్సు లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ ఇలాంటి పనులు చేసాడు. చట్టరీత్యా ఇది నేరం, శ్రేష్టి వర్మ తనకు తానూ కేసు వెనక్కి తీసుకుంటే తప్ప, జానీ మాస్టర్ బయటకి వచ్చే అవకాశం లేదు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More