Johnny Master And Ram Charan: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘చికిరి..చికిరి'(Chikiri..Chikiri Movie) మేనియా నే కనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ పాటలోని హూక్ స్టెప్ ని అనుకరిస్తూ రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఈమధ్య కాలం లో ఒక పాటలోని స్టెప్ ఇంతలా వైరల్ అవ్వడం ఈ సినిమాకే జరిగింది. గతం లో ఇంతటి ప్రభావం చూపించిన సినిమా ‘పుష్ప’. ఇకపోతే ‘చికిరి..చికిరి’ పాటకు జానీ మాస్టర్(Jani Master) కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. ఒక సమస్య లో నిందలు మోస్తూ జైలు కి వెళ్లి రిమాండ్ లో కొంతకాలం గడిపి బయటకు వచ్చిన జానీ మాస్టర్ కి రామ్ చరణ్(Global Star Ram Charan) అండగా నిల్చి, ‘పెద్ది'(Peddi Movie) సినిమాలోని పాటలన్నిటికీ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆయన నుండి వచ్చిన ఈ చికిరి చికిరి పాట ఇంత పెద్ద హిట్ అవ్వడం నిజంగా జానీ మాస్టర్ కి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.
అయితే ఈ పాటను జానీ మాస్టర్ రామ్ చరణ్ తో కాకుండా ఏ హీరో తో చేసినా ఇంతలా క్లిక్ అయ్యేది కాదు అనేది విశ్లేషకుల వాదన. ఎందుకంటే రీసెంట్ గా జానీ మాస్టర్ ఒక అమ్మాయి తో కలిసి ఈ పాటకు స్టెప్పులు వేస్తాడు. హూక్ స్టెప్ జానీ మాస్టర్ వేసినప్పుడు అంత అందంగా కనిపించలేదు కానీ, రామ్ చరణ్ వేసినప్పుడు మాత్రం చాలా అందంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్ జానీ మాస్టర్ కంటే రామ్ చరణ్ బాగా డ్యాన్స్ వేసాడు, జానీ మాస్టర్ రామ్ చరణ్ గ్రేస్ ని మ్యాచ్ చేయలేకపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ క్రింది వీడియో ని చూస్తే అలాగే అనిపిస్తోంది. రామ్ చరణ్ హూక్ స్టెప్పులను ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ వేసాడు.
ఇకపోతే రీసెంట్ గానే పెద్ది చిత్రం లో మరో పాటని కూడా చిత్రీకరించాడట డైరెక్టర్ బుచ్చి బాబు. ఈ పాటకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడట. ఇది కూడా చాలా బాగా వచ్చినట్టు చెప్తున్నారు. ‘చికిరి..చికిరి’ పాటలోని స్టెప్పులు కేవలం ఒక టీజర్ మాత్రమే, త్వరలో విడుదల చేయబోయే రెండవ పాటలోని రామ్ చరణ్ స్టెప్పులు చూస్తే అభిమానులు మెంటలెక్కిపోతారని, ఈ రేంజ్ స్టెప్పులు రామ్ చరణ్ కెరీర్ ప్రారంభం లో వేసేవాడు అని, మళ్లీ ఇన్నాళ్లకు ఆయన వింటేజ్ స్టెప్పులు వేస్తున్నాడనే టాక్ గట్టిగా నడుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ‘పెద్ది’ నుండి వచ్చే కంటెంట్ నిజంగానే పైన చెప్పిన విధంగా ఉంటుందా లేదా అనేది.