Johnny Depp: మాజీ భార్య అంబర్ హెర్డ్ నుండి లైంగిక వేధింపులు, గృహహింస వంటి ఆరోపణలు ఎదుర్కొన్న హాలీవుడ్ స్టార్ జానీ డెఫ్ కేసు నుండి బయట పడిన విషయం తెలిసిందే. అంబర్ హెర్డ్ ఆరోపణలు కొట్టివేసిన కోర్టు అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన సంతోషానికి అవధులు లేవు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న జానీ డెఫ్ ఓ ఇండియన్ రెస్టారెంట్ లో చేసిన బిల్… వరల్డ్ వైడ్ పతాక శీర్షికలకు ఎక్కింది. బర్మింగ్ హామ్ లో జానీ డెప్ ఓ భారతీయ రెస్టారెంట్ కు వెళ్ళాడు. అక్కడ భారత వంటకాలను రుచి చూడడమే కాదు.. భారీ మొత్తంలో బిల్లు కూడా చేశాడు. జానీ డెప్ తన సిబ్బంది, సన్నిహితులతో పాటు జూన్ 5న బర్మింగ్ హామ్ లోని వారణాసి రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ బటర్ చికెన్, పన్నీర్ టిక్కా మసాలా, లాంబ్ కరాచి, కింగ్ ప్రావన్ భూన, రైస్ లాంటి ఫేమస్ ఇండియన్ డిషెష్ రుచి చూశారు. సాయంత్రం 7 గంటల సమయంలో రెస్టారెంట్ కు వచ్చిన వారు ముందు కాక్ టెయిల్ పార్టీ చేసుకున్నారు. అనంతరం భారతీయ వంటకాలను కడుపారా లాగించారు.

ఇక భారతీయ రుచులకు ముగ్దుడైన జానీ మంచి టిప్ ఇవ్వడం జరిగింది. అలాగే సదరు వారణాసి రెస్టారెంట్ లో పనిచేస్తున్న స్టాఫ్ తో ఫోటోలు దిగారు. ఇక వారణాసి హోటల్ లో ఆయన నిర్వహించిన పార్టీ బిల్ చూస్తే జనాల మైండ్ బ్లాక్ కావలసిందే. ఏకంగా £ 50,000 చెల్లించారట. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 49 లక్షలు అన్నమాట. వారణాసి రెస్టారెంట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మహమ్మద్ హుస్సేన్ దీనిపై స్పందించారు. జానీ డెప్ రెస్టారెంట్ కు వచ్చిన వివరాలను ఆయన వెల్లడించారు.ఆదివారం మధ్యాహ్నం మాకు ఒక కాల్ వచ్చింది. డెప్ మా రెస్టారెంట్ కు రావాలనుకుంటున్నట్టు చెప్పారు. నేను షాక్ అయ్యాను. కానీ, అతడి సెక్యూరిటీ బృందం వచ్చి రెస్టారెంట్ ను చెక్ చేసింది. దీంతో జానీ డెప్ బృందానికి విశాలమైన ప్రదేశాన్ని విడిచి పెట్టాం అని వివరించాడు.
Also Read: Pawan Kalyan 3 Options పవన్ కళ్యాణ్ ముందు చేయాల్సిన పని ఇదే!

2015లో హీరోయిన్ అంబర్ హెర్డ్ ని జానీ డెప్ వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా 2017లో ఇద్దరూ విడిపోయారు. అంబర్ ఆరోపణల నేపథ్యంలో కొన్నాళ్లుగా జానీ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ కేసుపై అంతిమ తీర్పు జడ్జి వెలువరించారు. అంబర్ హెర్డ్ ఆరోపణల్లో నిజం లేదన్న కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఇక పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ జానీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. ది లోన్ రేంజర్ సైతం భారత్ లో ఆదరణ దక్కించుకుంది. విలక్షణ నటన, పాత్రలకు జానీ డెప్ ప్రసిద్ధి గాంచారు.
Also Read:Top Heroine: టాలీవుడ్ గుసగుస: అగ్ర నిర్మాతను ఆ టాప్ హీరోయిన్ సం‘తృప్తి’ పరుస్తోందట!
Recommended Videos
[…] […]