Mahesh Babu: తెలుగు సినిమాల్లో హీరో మహేశ్ బాబు ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా మాట్లాడతారు. తనతో పాటు పని చేసిన వారు కూడా అలాగే ఉండాలని ఆకాంక్షిస్తారు. అందుకే ఆయనను అందరు ఇష్టపడుతుంటారు. సూపర్ స్టార్ గా అభివర్ణిస్తుంటారు. తనతో పాటు పని చేసే దర్శకులు, నిర్మాతలు, టెక్నిషియన్లు అందరి బాగోగులు కోరుకుంటారు. అందుకే మహేశ్ ను అందరు ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన సిద్ధాంతాలను ఫాలో అవుతుంటారు. ఆయన స్లిమ్ నెస్ కు అందరు ఫిదా అవుతుంటారు. అందులో ఉన్న రహస్యమేమిటని ప్రశ్నిస్తుంటారు. కానీ ఆయన మాత్రం సీక్రెట్ ఏమీ లేదని చెబుతుంటారు.

ఆయనతో పని చేసిన దర్శకులు వంశీ పైడిపల్లి, పరశురామ్, సంగీత దర్శకుడు థమన్ ముగ్గురు స్లిమ్ గా మారారు. మహేశ్ బాబుతో పనిచేసిన తరువాతే వారిలో ఈ మార్పులు కనిపించాయి. మహర్షి సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. సర్కారు వారి పాట ను పరశురామ్ నిర్మించారు. ఇక దూకుడు నుంచి థమన్ తో మహేశ్ బాబుకు పరిచయం ఉంది. దీంతో మహేశ్ సూచనల మేరకు వారు తమ బాడీలను తగ్గించుకుని స్లిమ్ గా మారినట్లు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan 3 Options పవన్ కళ్యాణ్ ముందు చేయాల్సిన పని ఇదే!
మహేశ్ బాబుతో పని చేయడంతో ఆయన అలవాట్లు, ఆహారం తీసుకునే విధానం అన్ని దగ్గరుండి చూసి వారు కూడా అదే బాటలో నడిచినట్లు తెలుస్తోంది. అందుకే స్లిమ్ గా మారినట్లు చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ బాబుతో పనిచేస్తే నాజూకుగా మారే అవకాశం కూడా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో నాజూకు తనానికి మారుపేరుగా నిలిచిన థమన్, వంశీ, పరశురామ్ లను అందరు చూసి ఆశ్చర్యపోతున్నారు.

మహేశ్ బాబుతో పనిచేసే వారికి అడ్వాంటేజ్ గా బరువు తగ్గే ఆఫర్ కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. బొద్దుగా ఉన్న వారు స్లిమ్ గా మారడంతో ఇప్పుడు అందరి దృష్టి వారిపైనే పడుతోంది. మనిషికి మందమే అందం అంటారు కానీ బాగా మందంగా ఉంటే ఎవరు కూడా చూడరు. ఉండే విధంగా ఉంటే సరిపోతుంది. అంతే కాని మందమంటే నలుగురు దొడ్డు ఉంటే కష్టం. అందుకే చక్కనమ్మ చిక్కినా అందమే అని అంటుంటారు. స్లిమ్ గా ఉండే వారంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
Also Read:Top Heroine: టాలీవుడ్ గుసగుస: అగ్ర నిర్మాతను ఆ టాప్ హీరోయిన్ సం‘తృప్తి’ పరుస్తోందట!
[…] […]
[…] […]