Jeevitha Rajasekhar: జీవితరాజశేఖర్ లపై చెక్ బౌన్స్ ఆరోపణలు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన ఈ న్యూస్ వెనుక.. జోస్టార్స్ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ ఉన్నారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి.. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసమని తమ దగ్గర రాజశేఖర్ అప్పులు తీసుకున్నారనీ… ఇప్పుడు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ ఆరోపించారు.

రాజశేఖర్ ఫ్యామిలీ ఆస్తులను తాకట్టుపెట్టి, తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు తీసుకున్నారని జోస్టర్ ఫిలిం సభ్యులు చెప్పారు. అప్పట్లో జీవిత తమ దగ్గరికొచ్చి చాలా ఎమోషనల్ అయ్యారనీ.. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ చెప్పడంతో.. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చామనీ కోటేశ్వరరాజు, హేమ చెప్పారు.
Also Read: Komaram Bheem Song: ‘కొమురం భీముడో ‘ వీడియో సాంగ్ ని అందుకే విడుదల చెయ్యలేదా??
కానీ, ఆ తర్వాత రాజశేఖర్ జీవిత తమ నిజస్వరూపం చూపించారు అని, వాళ్ళు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మోసానికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయంటున్నారు జోస్టర్ ఫిలిం సర్వీస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ తెలియజేశారు. అయితే కోటేశ్వరరాజు, హేమ ఆరోపించిన ఆరోణపల పై తాజాగా జీవిత స్పందించింది.

‘శేఖర్’ సినిమా ప్రెస్‌మీట్ లో జీవిత మాట్లాడుతూ ‘‘మాపై వచ్చిన ఆరోపణల కేసు ప్రాపెసింగ్ లో ఉంది. నగరి నుంచి సమన్లు వచ్చి రెండు నెలలు అవుతుంది. అవి మాకు అందకుండా చేశారు. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. అసలు మాపై ఆరోపణలు చేసినవారు ఉత్తములు కాదు.
పైగా వారి కారణంగా మా మేనేజర్ తో పాటు చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని అందరికీ తెలుసు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఏది నిజమో కోర్టు చెబుతుంది. కాబట్టి దీని గురించి నేను ఏమి మాట్లాడదలచుకోలేదు. జీవిత పేర్కొన్నారు.
అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జీవితరాజశేఖర్ మోసం చేశారని.. వాళ్ళు గతంలో కూడా ఇలాంటి మోసాలు చేశారని.. ఇక కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అయినా మోసం చేసి.. బుకాయిస్తే ఎలా ? మరి దీనికి జీవిత ఏమి అంటుందో చూడాలి.
Also Read:Hero Yash: KGF 2: యశ్ కి ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. యశ్ షాకింగ్ కామెంట్స్ !
Recommended Videos:
[…] Koratala Shiva: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ను ఫైనల్ చేసుకున్నారు. కానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. గత వారం రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె ఈ నిర్ణయం తీసుకుందని టాక్ నడిచింది. […]
[…] Singer Sunitha: సింగర్ సునీత తల్లి కాబోతుంది అని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఐతే, సునీత ఈ రోజు ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా తెలియజేస్తూ ఫోటోతో పాటు ఒక పోస్ట్ పెట్టింది. పైగా ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ పోస్ట్ లో సునీత ఏమి పెట్టింది అంటే.. మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయను పట్టుకుని ‘బ్లెస్ట్’ అని మెసేజ్ చేసింది సునీత. […]