Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రాంతీయత విద్వేషాలు రెచ్చ గొట్టడం గత వారం నుంచి ముమ్మరంగా జరుగుతుంది. దీనికితోడు పోటీ చేస్తోన్న సభ్యులు ఇష్టం వచ్చినట్లు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నరేష్ పై అనేమంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు, శివాజీ రాజా లాంటి వాళ్ళు నరేష్ పై డైరెక్ట్ గానే విమర్శలు చేశారు.

అయితే, ఇప్పుడు జీవిత చేసిన విమర్శలు మాత్రం మోహన్ బాబు ఫ్యామిలీ బాధ పడేలా చేసింది. ‘నటుడు నరేష్ తవ్విన గుంతలో మోహన్ బాబు ఫ్యామిలీ పడిపోయింది’ అంటూ జీవితారాజశేఖర్ సంచలన కామెంట్స్ చేసింది. పైగా జీవిత, మంచు విష్ణు పై కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. ధర్మంగా, న్యాయంగా పోరాడాలి గానీ, బెదిరింపులు, ప్రలోభాలు, ఎందుకు చేస్తున్నారు ? తాయిలాలు ఎందుకు ఇస్తున్నారు ? అంటూ జీవిత, మంచు విష్ణు గురించి కామెంట్స్ చేసింది.
నిజానికి మంచు విష్ణు బెదిరింపులు, ప్రలోభాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ఎక్కడా టాక్ లేదు. పైగా తాయిలాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆమె కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యల పై మోహన్ బాబు సీరియస్ గా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే.. తమ పై విమర్శలు చేసినా ప్రతి ఒక్కరికీ తనదైన శైలిలో సమాధానం చెప్పాలి అని మోహన్ బాబు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
మరి మోహన్ బాబు ఏ స్థాయిలో సీరియస్ అవుతారో చూడాలి. అయినా ఎన్నికల్లో ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. అందులో తప్పేం లేదు. కానీ, గెలుపు కోసం ధర్మంగా పోరాడాలి. ఆ పోరాటంలో అతి ఉండకూడదు. ముఖ్యంగా అడ్డమైన తిట్లు తిట్టుకుంటూ విమర్శలు చేసుకోకూడదు. కానీ ‘మా’ లో జరుగుతుంది ఏమిటి ? ఇది మన కుటుంబం అంటూనే మా సభ్యులు అనవసరమైన కామెంట్స్ చేసుకుంటున్నారు.
అయినా, మంచి చేయడానికి పోటీ చేస్తున్నాం అని చెబుతూ లంచం ఎందుకు ఇస్తున్నారు ? ఎందుకివ్వాలి? ఒక్కటి మాత్రం నిజం, జీవిత కాస్త ఆవేశంతో మాట్లాడింది. ముఖ్యంగా మోహన్ బాబు కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తోంది అంటూ ఆమె మాట్లాడటం కచ్చితంగా కరెక్ట్ కాదు. జీవిత జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె పరిధి దాటి మాట్లాడుతుంది.