Jayaprakash Narayan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. మూడేళ్ళ పాటు అభిమానులు నిరీక్షించి ఎదురు చూసినందుకు ఈ సినిమా వాళ్లకు మిగిల్చిన చేదు అనుభవాలను జీవితాంతం మర్చిపోలేరు. ప్రతీ హీరో కెరీర్ లోనూ కొన్ని మర్చిపోని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కి ‘అజ్ఞాతవాసి’, మహేష్ బాబు కి ‘బ్రహ్మోత్సవం’ , ఎన్టీఆర్ కి ‘రభస’, అల్లు అర్జున్ కి ‘వరుడు’ లాగా రామ్ చరణ్ కి ‘గేమ్ చేంజర్’ చిత్రం అలా అన్నమాట. కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని అనుకుంటే, చివరికి ఇలా మిగిలిపోయింది. ఓటీటీ లో విడుదలయ్యాక ఇప్పుడు ఈ సినిమా పై ప్రముఖులు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారిలో ‘లోక్ సత్తా’ పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణ్(Jaya prakash narayan) కూడా చేరిపోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘గేమ్ చేంజర్’ చిత్రం లో ఎంపీ(విలన్ క్యారక్టర్) కలెక్టర్ (హీరో క్యారక్టర్) ఆఫీస్ కి వెళ్లడం. కలెక్టర్ ఒక ముఖ్యమైన భేటీ లో ఉండడం వల్ల ఎంపీ ని గంటల తరబడి బయట కూర్చోబెట్టడం. అ తర్వాత లోపలకు వచ్చిన తర్వాత కలెక్టర్ ఎంపీ ని అవమానించే తీరు, ఆ సమయం లో హీరో కలెక్టర్ జాబ్ యొక్క గొప్పతనం గురించి చెప్తే, మేము లేకపోతే ప్రజానాయకులు సూన్యం అంటూ చెప్పే డైలాగ్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సన్నివేశంపై జయ ప్రకాష్ నారాయణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటి చెత్త సందేశాలు యువత అనుసరించకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులూ అంటే మీకు అంత చులకనగా అనిపిస్తుందా?’ అంటూ ఆయన మండిపడ్డాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు కానీ, నా ముందు ఉంటే మాత్రం కదిపారేసేవాడిని. పవిత్రమైన ఓటు ద్వారా జనాలు ఎన్నుకోబడిన ఎంపీ కి ఒక కలెక్టర్ ఇచ్చే విలువ ఇదా?, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నవాళ్ళెవ్వరూ కూడా ఇలాంటివి జనల మీదకు రుద్దరు. ఇలాంటోళ్లను దేశ ద్రోహులు అంటారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. నువ్వు 5 సంవత్సరాలే పదవి లో ఉంటావు, నేను చనిపోయే వరకు కలెక్టర్ అని అంటాడా?, ఎంత అహంకారం ఇది అంటూ జయప్రకాశ్ నారాయణ్ చిరాకు పడ్డాడు. ఆయన పూర్తిగా ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియోలో చూడండి. అయితే ఆ వీడియో క్రింద కామెంట్స్ లో మాత్రం జయ ప్రకాష్ నారాయణ్ అభిప్రాయంపై అత్యధిక శాతం మంది వ్యతిరేకతను వ్యక్తం చేసారు. ప్రభుత్వ అధికారులు కలెక్టర్ల వ్యవస్థని తోలుబొమ్మలు లాగా ఆడిస్తున్న ఈ కాలంలో కలెక్టర్ల యొక్క ప్రాధాన్యత తెలియచేయడం కోసమే ఇలాంటి సన్నివేశాలు రాసి ఉండొచ్చని అంటున్నారు.
