Hero Nani: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఆయన కెరీర్ ప్రారంభం లో ఎన్ని ఒడిదుగులను ఎదురుకున్నాడు?, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురు అయ్యాయి?, సినిమాల్లోకి రాకముందు ఆయన జీవితం ఎలా ఉండేది? ఇలాంటివి ఆయన ఇప్పటి వరకు గతంలో ఏ ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకోలేదు. అయితే రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలైన జగపతి బాబు(Jagapathi Babu) ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammuraa) లేటెస్ట్ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన తన జీవితం గురించి చెప్పుకొచ్చిన ఎన్నో విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నాని బాల్యం గురించి ఎవరికీ తెలియదు. దానిని కూడా ఆయన ఈ ఇంటర్వ్యూ లో కవర్ చేసాడు.
Hero Nani తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
ముందుగా జగపతి బాబు నాని కి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. తనకి కూడా ఎక్కడ ఉందో తెలియని స్కూల్ ID కార్డు ని నాని చేతిలో పెడుతాడు. ఆ ID కార్డు ని చూసి నాని ఎంతో సర్ప్రైజ్ కి గురి అవుతాడు. ఆయనలో ఒక చిన్నపిల్లాడిని ఆ సమయం లో మనం చూడొచ్చు. ఇంతకీ నువ్వు స్కూల్ లో మంచి విద్యార్థివేనా అని జగపతి బాబు అడగ్గా, దానికి నాని సమాధానం చెప్తూ ‘అసలు కాదు.. చదువుకోకపోతే ఎలా తయారు అవుతారో నన్ను ఉదాహరణగా మా ఇంట్లో, అలాగే మా స్కూల్ లో చూపించేవారు’ అని అంటాడు. చిన్నతనం లో నీకు పాఠాలు చెప్పిన టీచర్లు ఎవరైనా ఇప్పుడు గుర్తు ఉన్నారా అని జగపతి బాబు అడగగా ‘నన్ను బాగా కొట్టే టీచర్స్ ని గుర్తు పెట్టుకోలేదు. కేవలం ఒక్క మేడం మాత్రమే నన్ను కొట్టకుండా జాగ్రత్తగా చూసుకునేది. ఆమెని మాత్రమే గుర్తు పెట్టుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఆ తర్వాత చిన్నప్పుడు నాని కి పరీక్షల సమయంలో అమ్మలాగా చూసుకున్న ఒక టీచర్ అక్కడికి వస్తుంది. నాని చిన్నతనం లో చేసిన అల్లరి గురించి,అతను క్లాస్ లో ఎలా ఉండేవాడో చెప్పుకొచ్చింది. క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉండేవాడు, అందరితో చాలా స్నేహంగా ఉంటాడు. కానీ ఏదైనా తప్పు చేస్తే తోలు తీసేదానిని అంటూ చాలా సరదాగా నాని గురించి అనేక విషయాలు చెప్పింది. చిన్నతనం నుండే నాని లోని నటుడ్ని ఆమె చూసిందట. అనేక కల్చరల్ ఈవెంట్స్ లో నాని నాటకాలు వేసేవాడట. ఆయన తన స్కిక్ట్స్ దర్శకత్వం, రచన కూడా చేసేవాడట. ఇలా చాలానే ఉన్నాయి. నాని కి సంభందించిన ఈ పూర్తి ఇంటర్వ్యూ చూడాలంటే జీ5 లో వెంటనే చూసేయండి.