Japan Collection : జపాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్… కార్తీ చిత్రానికి ఎన్ని కలెక్షన్స్ అంటే?

జపాన్ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్హునుకుంది. కార్తీ పెర్ఫార్మన్స్ మినహాయించి సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క విషయం లేదని టాక్. ఇది వసూళ్ల మీద ప్రభావం చూపింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో జపాన్ యావరేజ్ ఓపెనింగ్ అందుకుంది.

Written By: NARESH, Updated On : November 11, 2023 10:02 am

Japan Collection

Follow us on

Japan Collection: దీపావళి కానుకగా విడుదలయ్యాయి జిగర్ తండ డబుల్ ఎక్స్, జపాన్ . తెలుగులో కూడా చెప్పుకోదగ్గ చిత్రాల విడుదల లేదు. దాంతో రెండు డబ్బింగ్ చిత్రాలు దివాళీ బరిలో దిగాయి. జపాన్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కార్తీ మేనరిజం, గెటప్, డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపించాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకున్న నేపథ్యంలో జపాన్ హిట్ కొట్టడం ఖాయం అనుకున్నారు. దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించగా అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా చేసింది.

జపాన్ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్హునుకుంది. కార్తీ పెర్ఫార్మన్స్ మినహాయించి సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క విషయం లేదని టాక్. ఇది వసూళ్ల మీద ప్రభావం చూపింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో జపాన్ యావరేజ్ ఓపెనింగ్ అందుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కి వసూళ్లకు సంబంధం లేదు. కార్తీ కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జపాన్ కి జరిగింది.

తమిళనాడు థియేట్రికల్ హక్కులు రూ. 25 కోట్లకు అమ్మారు. ఏపీ/తెలంగాణ హక్కులు రూ. 10 కోట్లకు, కర్ణాటక, కేరళ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ తో కూడా కలిపి జపాన్ రూ. 150 కోట్ల బిజినెస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

నెగిటివ్ టాక్ తెచ్చుకున్న జపాన్ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 6 నుండి 10 కోట్ల షేర్ వసూలు చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే జపాన్ కి లాంగ్ వీకెండ్ దక్కింది. సోమవారం కూడా సెలవు దినమే. మరో మూడు రోజుల సెలవులు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీలేని క్రమంలో నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం కలదు.