Homeఎంటర్టైన్మెంట్Jani Master out from Aata show: 'ఆట' షో నుండి జానీ మాస్టర్ అవుట్..ఆయన...

Jani Master out from Aata show: ‘ఆట’ షో నుండి జానీ మాస్టర్ అవుట్..ఆయన స్థానంలో అడుగుపెట్టిన ఆ ఇద్దరు..కారణం ఏంటంటే!

Jani Master out from Aata show: రీసెంట్ గానే ‘జీ తెలుగు’ లో ‘ఆట'(Aata Dance Show) అనే డ్యాన్స్ రియాలిటీ షో మొదలైంది. ఈ షో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) హోస్ట్ గా, రాధికా, జానీ మాస్టర్(Jani Master), నిహారిక కొణిదెల(Niharika Konidela) జడ్జీలు గా, విష్ణు ప్రియ, కావ్య, వంశీధర్, సమీరా భరద్వాజ్ లు మెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. అయితే ఈ వారం టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్ లో జానీ మాస్టర్ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు బదులుగా రఘు మాస్టర్, సీనియర్ హీరోయిన్ రంభ వంటి వారు ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ షో కి అతిథిగా విచ్చేశాడు. అయితే జానీ మాస్టర్ ఎందుకు రాలేదు? అనే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది.

ఈ షోకి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ కి జానీ మాస్టర్ బాగా క్లోజ్ కాబట్టి నిహారిక ఆయన్ని తీసుకొచ్చింది అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే నాలుగు ఎపిసోడ్స్ కే జానీ మాస్టర్ మాయం అయిపోయాడు. అంటే నిహారిక తో జానీ మాస్టర్ కి పడలేదా?, ఆమె ఇచ్చే రెమ్యూనరేషన్ సరిపోక ఈ షో నుండి లెఫ్ట్ అయ్యాడా?, లేదంటే సినిమా షూటింగ్స్ లో బిజీ గా ఉండడం వల్ల ఆయన ఈ వారం ఎపిసోడ్స్ కి గైర్హాజరు అయ్యారా?, అసలు ఏమి జరిగింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జానీ మాస్టర్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీ కోసమే ఈ వారం ‘ఆట’ షోకి డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది.

వచ్చే వారం నుండి ఆయన యదావిధిగా కొనసాగుతాడని సమాచారం. అయితే జానీ మాస్టర్ ఉన్నా లేకపోయినా, కచ్చితంగా సీనియర్ హీరోయిన్ రంభ ఈ షోలో ఉండాల్సిందే అని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ షోలోకి అడుగుపెట్టగానే సుడిగాలి సుధీర్ ఆమె కోసం చెప్పిన డైలాగ్స్ చాలా బాగా అనిపించింది. సుధీర్ రంభ తో మాట్లాడుతూ ‘బేసిక్ గా మీరు ఎక్కడ ఉంటారండీ’ అని అడగ్గా, ‘టొరంటో లో ఉంటానండీ’ అని రంభ సమాధానం ఇస్తుంది. అందుకు సుడిగాలి సుధీర్ ‘మరి అదేంటి, ఎప్పుడూ నా గుండెల్లో ఉన్నట్టు అనిపిస్తారు’ అని అంటాడు. ఇలా ఫన్నీ పంచులతో ఈ వారం ఎపిసోడ్స్ చాలా కలర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular