
కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో సినీ సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. రకరకాలుగా సెలబ్రెటీలు కాలక్షేపం చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలు, పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో సినిమాలకు దూరమైన ప్రేక్షకులు సోషల్ మీడియాలో సెలబ్రెటీలను ఫాలోవుతూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. పలువురు హీరోయిన్లు తమలోని కొత్త కళను బయటికి తెస్తున్నారు. మరికొందరేమో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఈ వేసవి మరింత హీటెక్కించే పనిలో పడ్డాయి. తాజాగా దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసిన డాన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు సినిమా విషయాల్లో కంటే ఎక్కువగా జిమ్ కు సంబంధించిన పిక్స్, వీడియోలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అడపదడగా డాన్స్ ఫార్మమెన్స్ చేస్తున్న వీడియోలతో అలరించేది. తాజాగా కరోనా ఎఫెక్ట్ తో బయటికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఇంట్లోనే తన ట్రైనర్ తో కలిసి చేసిన డాన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఐశ్వర్య రాయ్ నటించిన ‘ఉమ్రవ్ జాన్’ చిత్రంలోని ‘సలామ్’ ట్రాక్ కు జాన్వీ కపూర్ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా ఆమె ఫార్మమెన్స్ ఉండటం విశేషం. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. కరోనాతో బయటికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఇంట్లోనే డాన్స్ శిక్షణ తీసుకుంటుంద. ప్రస్తుతం జాన్వీకపూర్ ‘కార్గిల్ గాళ్’, ‘రూహ్ అఫ్జా’, ‘తక్త్’ సినిమాల్లో నటిస్తూ బీజీగా మారింది.