Janhvi Kapoor: అతిలోక సుందరి, అలనాటి అందాల తార ‘శ్రీదేవి’ మన మధ్య లేకపోయినా ఆమె వారసత్వం మాత్రం ప్రేక్షకులను అలరించడానికి పోటీ పడుతోంది. ఇప్పటికే శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది. అయితే, ముంబై ఎయిర్ పోర్టులో జాన్వీ కపూర్ చూపించిన వినయం చూసి మీడియా జనం ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జాన్వీ కపూర్ బర్త్‌డే రోజు తిరుపతి వస్తూ.. ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్ళింది. సడెన్ గా జాన్వీ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించే సరికి.. మీడియా జర్నలిస్టులు అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్ చెప్పారు. పైగా ఒక కేక్ తెచ్చి ఆమె ముందు పెట్టారు. సహజంగా ఇలాంటివి హీరోయిన్లు పెద్దగా పట్టించుకోరు. కానీ జాన్వీ మాత్రం ఎంతో ఓపికగా వాళ్ళు తెచ్చిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచి పెట్టింది.
పైగా ప్రతి ఒక్కరితో సెల్ఫీ దిగి వారి పట్ల తెగ విధేయత చూపిస్తూ వారితో సరదాగా గడిపింది. ఇదంతా వీడియో తీసి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.
ఇక ఈ అతిలోక సుందరి తనయకు విహారయాత్రలకే కాదు.. ఆధ్యాత్మిక యాత్రలు కూడా బాగా ఇష్టం అట. అందుకే తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆమె ప్రతి ఏడాది ప్రత్యేకంగా దర్శించుకుంటుందట.

పైగా ఈ సారి జాన్వీ మెట్ల మార్గంలో తిరుమల చేరుకోవడం విశేషం. భవిష్యత్తులో తన పెళ్లి కూడా తిరుపతిలోనే చేసుకుంటాను అని జాన్వీ కపూర్ స్వయంగా వెల్లడించింది. మరి జాన్వీ కోరుకున్నట్టుగా ఆమె పెళ్లి తెలుగు నెల పై తిరుమలలోనే జరగాలని కోరుకుందాం.
View this post on Instagram
[…] Also Read: అరె.. ఎంతో ఓపికగా అందరికీ పంచి పెట్టి… […]