Janhvi Kapoor- Vijay-Deverakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో ‘జనగణమన’ సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్టు కావడంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ‘జనగణమన’ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తీసుకువస్తున్నారు. అందుకే.. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ముంబైలో ఘనంగా లాంచ్ చేశారు.

త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లనున్నారు. ఎలాగూ పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తీసుకోవాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే అదిరిపోతోంది.
మరి జాన్వీ కపూర్ ఈ సినిమా చేస్తుందో ? లేదో ? చూడాలి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఉంది అంటూ జాన్వీ పబ్లిక్ గా చెప్పుకొచ్చింది. కాబట్టి.. కచ్చితంగా ఆమె ఈ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇక మొన్న ‘జనగణమన’ నుంచి వచ్చిన పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్ వ్యూ అండ్ కలర్ టోన్ అండ్ మూవీ కాన్సెప్ట్ తాలూకు విజువల్ సెన్స్ బాగున్నాయి.
పైగా భయంకరమైన యుద్ధ వాతావరణంలో శత్రువులను అంతమొందించేందుకు నింగి నుంచి భారత సైనికులు నేలకు దూకుతున్న దృశ్యాలతో తొలి పోస్టర్ ను డిజైన్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. విజయ్ – పూరి ‘లైగర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.

విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు. అందుకే పూరితో విజయ్ బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే, పూరి – విజయ్ దేవరకొండ కలయిక మరోసారి కుదిరింది. అన్నట్టు ‘లైగర్’ 2022 ఆగస్టులో విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
[…] CM Jagan: ఏపీలో పరిస్థితులు చూస్తుంటే.. అమ్మ పెట్టదు. అడుక్క తిననివ్వదు అన్నట్టే ఉంది. జగన్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయింది. పైగా ఎక్కడ ఏం నిధులు దొరుకుతాయా.. లాగేసుకుందామా అని మిగతా సంస్థలపై పడుతోంది. ఇప్పటికే కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు. ఇప్పుడు పంచాయతీపై పడిపోయింది. […]