Janhvi Kapoor: ఏడేళ్ల క్రితం అనుష్క హీరోయిన్ గా సైజ్ జీరో అనే ఒక సినిమా వచ్చింది. అందులో ఆ పాత్ర కోసం అనుష్క విపరీతంగా బరువు పెరిగింది. దానివల్ల ఆమె షేప్ అవుట్ అయింది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా అనుష్క కోలుకోలేదు. ఒకటి అరా చిత్రాల్లో కనిపించినప్పటికీ మునుపటి చార్మింగ్ ఆమె ముఖంలో అగుపించలేదు. వాస్తవానికి పాత్రల కోసం దేనికైనా చేసే నటినటులు ఉన్నారు. పాత్ర కోసం బరువు తగ్గే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పెరిగే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇది తమ శరీరం మీద ప్రభావం చూపిస్తుందనే భయమే కావచ్చు. ఇక ఒక్కో యాక్టర్ కు ఒక పాత్ర సవాల్ విసురుతూ ఉంటుంది. దానిని స్వీకరించి ముందుకెళ్లినప్పుడే అసలైన నటన ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం బోనీ కపూర్ కుమార్తె జాన్వికపూర్ కు ఎదురైంది. మైనస్ 16 డిగ్రీల గడ్డకట్టుకుపోయిన చలిలో ఇరుక్కుపోయిన మహిళగా ఆమె నటించింది. వాస్తవానికి కొద్దిరోజులుగా హిందీ సినిమాలు అంతగా అడటం లేదు. ఈ నేపథ్యంలో అరువు కథలపై అక్కడి నిర్మాతలు దృష్టి సారించారు. అలా మలయాళం లో సూపర్ హిట్ అయినా హెలెన్ అనే సినిమాకు రీమేక్ గా మిలి అనే సినిమా బాలీవుడ్ లో రూపొందింది. ఈ చిత్రంలో లీడ్ రోల్ లో జాన్వి కపూర్ నటించింది.

7.5 కిలోల బరువు పెరిగింది
మిలి చిత్రంలో బిఎస్సి నర్సింగ్ చదివే మిలీ నౌదియార్ అనే విద్యార్థిగా జాన్వి కపూర్ కనిపించింది. దర్శకుడి సూచన మేరకు ఈ పాత్రకు ఆమె ఏడున్నర కిలోల బరువు పెరిగింది. ఈ సినిమా విషయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడింది. జాన్వి కపూర్ పోషించిన పాత్ర లో ఫ్రిడ్జ్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఆమె కలలోకి కూడా వచ్చేవట.. సరిగా నిద్ర కూడా పట్టేది కాదట. దీంతో ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది.. మూడు రోజులపాటు పెయిన్ కిల్లర్స్ వాడింది.. ఆమెతో పాటు ఈ చిత్ర దర్శకుడు కూడా అస్వస్థకు గురయ్యాడు.. “రోజులో 15 గంటల పాటు ఫ్రీజర్ లో ఉంటే.. ఒక ఎలుక మీ చేతి వేళ్లను కొరుకుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఊహించడమే కష్టంగా ఉంది కదా” అలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది.

వస్త్రధారణ పై విమర్శలు
శ్రీదేవి కుమార్తె కావడంతో మీడియా ఫోకస్ జాన్వికపూర్ పై ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ నటిమణి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. ఆమధ్య ఈమె బికినీ వేసుకొని పోస్ట్ చేసిన చిత్రాలు కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపాయి. అదే సమయంలో ఈమెపై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఆమె వేసుకునే వస్త్రాలపై విమర్శలు వెల్లు వెత్తాయి. దీంతో నా తండ్రికి లేని ఇబ్బంది మీకెందుకు అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇక అన్నింటికన్నా మించి ఈమెను నెపోటిక్ కిడ్ అని విమర్శించిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే నవంబర్ 4 న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక జాన్వి కపూర్ త్వరలో ఎన్టీఆర్ తో జోడి కట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.