Janhvi Kapoor: రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం తో నేషనల్ లెవెల్లో హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో మనమంతా చూశాము. ఇప్పటి వరకు ఆమె తన కెరీర్ లో చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే , ఈ సినిమా మరో ఎత్తు. ఎందుకంటే అన్ని వివాదాలు ఈ చిత్రం కారణంగా ఆమె మెడకు చుట్టుకున్నాయి. డైరెక్టర్ బుచ్చి బాబు ఆమె క్యారెక్టర్ ని అత్యంత నీచంగా ఈ సినిమాలో చూపించాడని , జాన్వీ కపూర్ మంచి పొటెన్షియల్ ఉన్న నటి అని , ఆమె ఇలాంటి పాత్రల్లో నటించడానికి అసలు ఎప్పుకుందో అర్థం కావడం లేదంటూ , ఆమెని అభిమానించే వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జాన్వీ కపూర్ మాత్రం ఇప్పటి వరకు ఈ వివాదం పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
రెగ్యులర్ గా తన లైఫ్ ని ఎలా లీడ్ చేస్తుందో, ఇప్పుడు కూడా ప్రశాంతం గా తన లైఫ్ ని లీడ్ చేస్తోంది. పైగా ఇప్పుడు ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పబ్బులకు , పార్టీలకు వెళ్లడం కూడా సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఆమె మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు , శిఖర్ పహారియా తో ప్రేమలో ఉంది. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమం లో జాన్వీ కపూర్ ధరించిన లేటెస్ట్ నైట్ టీ షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు , ఆ టీ షర్ట్ పై ‘ఒకవేళ నేను తప్పిపోతే దయచేసి నన్ను శిఖర్ వద్దకు తీసుకెళ్లండి’ అని క్యాప్షన్ రాసుంది. ఒకరి పై ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అంతే కాదు , త్వరలోనే పెళ్లి కబురు చెప్పాలని , అందుకోసం మేమంతా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు నెటిజెన్స్. ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువ లాగా వస్తున్నాయి. కానీ జాన్వీ కపూర్ ఏ సినిమాకు కూడా అధికారికంగా ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదు. మరోపక్క ఈమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో జాన్వీ కపూర్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు నెటిజెన్స్. మరి రాబోయే రోజుల్లో ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
