https://oktelugu.com/

Ramcharan-Janhvi Kapoor : పట్టు చీరలో జాన్వీ.. నైట్‌ డ్రెస్‌లో ఉపాసన .. రాంచరణ్ ఇలా.. ఏంటీ కథ?

ఆర్‌సీ – 16 సినిమా ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ పట్టు చీరలో హాజరై తళుక్కుమన్నారు. పూజాకార్యక్రమంతోపాటు ముహూర్తం షాట్‌లోనూ జాన్వీ చీరకట్టులోనే పాల్గొన్నారు. భారతీయ వస్త్రధారణలో వచ్చిన పాన్‌ ఇండియా స్టార్‌ జాన్వీ కట్టు బొట్టు చూసి అతిథులు ముగ్ధులయ్యారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2024 / 01:15 PM IST

    Ramcharan-Janhvi Kapoor

    Follow us on

    Ramcharan-Janhvi Kapoor : ఆర్‌ఆర్‌ఆర్‌లో పాన్‌ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్‌ క్రియేట్‌ చేసిన గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. తొలిచిత్రం ఉప్పెనతో బ్లాక్‌బస్టర్‌ అందించిన దర్శకుడు బుచ్చిబాబు. వీరింద్దరి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ ఆర్‌సీ–16 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీవ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

    ప్రారంభోత్సవానికి వచ్చిన అతిరథులు..
    ఆర్‌సీ – 16 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్‌ అతిరథులు తరలి వచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్, స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ అల్లు అరవింద్, బోనీ కపూర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌. రహమాన్, గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్, జాన్వీకపూర్, సినిమా దర్శకుడు బుచ్చిబాబు, సమర్పకులు సుకుమార్, దిల్‌రాజు శిరీష్, సాహూ గారపాటి, రామ్‌ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరలు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్‌ చిరంజీవి క్లాప్‌ కొట్టగా బోనీకపూర్‌ స్విచ్‌ఆన్‌ చేశారు. శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

    పట్టు చీరలో తళుక్కుమన్న జాన్వీ..
    ఆర్‌సీ – 16 సినిమా ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ పట్టు చీరలో హాజరై తళుక్కుమన్నారు. పూజాకార్యక్రమంతోపాటు ముహూర్తం షాట్‌లోనూ జాన్వీ చీరకట్టులోనే పాల్గొన్నారు. భారతీయ వస్త్రధారణలో వచ్చిన పాన్‌ ఇండియా స్టార్‌ జాన్వీ కట్టు బొట్టు చూసి అతిథులు ముగ్ధులయ్యారు.

    నైట్‌వేర్‌లో ఉపాసన..
    ఆర్‌సీ –16 సినిమా హీరో, గ్లోబల్‌స్టార్‌ చామ్‌చరణ్‌ భార్య ఉపాసన కూడా సినిమా ప్రారంభత్సోవానికి హాజరయ్యారు. అయితే ఆమె ధరించిన డ్రెస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. హీరోయిన్‌ అయిన జాన్వీ సంప్రదాయ వస్త్రధారణలో హాజరు కాగా, ఉపాసన మాత్రం నైట్‌వేర్‌ను పోలిన కాస్ట్యూమ్‌లో హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఇటీవలే బిడ్డకు తల్లి అయిన ఉపాసన మోడ్రన్‌ డ్రెస్‌లో కార్యక్రమానికి రావడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు.