Homeఎంటర్టైన్మెంట్Janasena MLA Arav Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలు హంస వీణ...

Janasena MLA Arav Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలు హంస వీణ మరో సంచలన వీడియో.. ఈసారి జనసేన టార్గెట్..

Janasena MLA Arav Sridhar Controversy: జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారం లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఏ రేంజ్ దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడిచేది. ప్రతిపక్ష వైసీపీ పార్టీ అయితే ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని ఏ రేంజ్ లో విమర్శించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ అంశం లో బాధితురాలిగా పిలవబడిన హంస వీణ కావాలని హానీ ట్రాప్ చేసి ఎమ్మెల్యే ని ఇరికించిందని , ఆమె చెప్పిన వాటిల్లో చాలా వరకు అబద్దాలు ఉన్నాయని కొన్ని రుజువు అవ్వడం, అదే విధంగా ఆమె అబద్దాలు చెప్పినందుకు అరెస్ట్ కూడా అవ్వడం వంటివి జరిగింది. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య సంబంధం ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

కానీ తప్పు మొత్తం ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వైపు తోయడం కరెక్ట్ కాదు, అందులో వీణ తప్పు కూడా ఎంతో కొంత ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇది కాసేపు పక్కన పెడితే ఆరవ శ్రీధర్ తప్పు చేశాడా లేదా అనే విషయం పై నిజా నిజాలు నిర్ధారణ అయ్యే వరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఈ అంశంపై విచారణ కమిటీ ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలా వద్ద అనే విషయం గురించి ఆలోచిస్తాము అంటూ ఒక లేఖని కూడా విడుదల చేశారు. అయితే ఆరవ శ్రీధర్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీ లో పాల్గొనడం పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పాడు కదా, ఇప్పుడు ఈ మీటింగ్ కి ఎందుకు వచ్చాడు?, దీని వెనుక ఉద్దేశ్యం ఏంటి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

అయితే దీనిపై హంస వీణ కూడా రెస్పాన్స్ ఇస్తూ ఒక వీడియో ని విడుదల చేసింది. ఈ వీడియో లో ఆమె మాట్లాడుతూ ‘అరవ శ్రీధర్ ని కమిటీ ద్వారా నిజా నిజాలు తేలేవరకు దూరం గా ఉండాలని ఆదేశించారు కదా, మరి ఇప్పుడు ఆయన పార్టీ కండువా వేసుకొని కార్యక్రమాలు ఎలా చేస్తున్నాడు?, పవన్ కళ్యాణ్ కి ఇంటర్నల్ గా ఏమైనా రిపోర్ట్ అందిందా?, రిపోర్ట్ రాకుండా, చర్యలు లేకుండా, పార్టీ కార్యక్రమాల్లో అతను ఎలా పాల్గొంటాడు, ఆధారాలు అన్నీ బయట పెట్టినా కూడా, ఏమి చేస్తావో చేసుకో అని వెటకారంగా మాట్లాడుతున్నారు. పార్టీ నుండి సస్పెండ్ కి గురైన వ్యక్తి మొన్న పవన్ మీటింగ్ లో ఎలా పాల్గొన్నాడు?, ఆడపిల్ల జీవితం అంటే ఆటలుగా ఉందా ?, లేదా ఆడవారి జీవితాలతో ఆదుకోండి అని అలవాటు చేస్తున్నారా? , ఇదంతా పవన్ కళ్యాణ్ కి తెలిసే జరుగుతుందా ?, లేదా తెలియక జరుగుతుందా ?, మీ పార్టీ కి నిజంగా సిద్ధాంతాలు ఉంటే నిరూపించండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version