Jananayagan Business: రెండు , మూడు నెలల క్రితం వరకు KVN ప్రొడక్షన్స్ సంస్థ ని చూసి అందరూ అయ్యోపాపం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియా లో ఈ నిర్మాతలను మించిన అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ చేతుల్లో ‘జన నాయగన్ ‘ చిత్రం ఉంది. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడం తో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా ఆన్లైన్ లో HD క్వాలిటీ తో లీక్ అయ్యింది. దాదాపుగా అందరూ ఈ చిత్రాన్ని ఆన్లైన్ లోనే చూసేశారు. పాపం నిర్మాత పరిస్థితి ఏంటో అని అంతా అనుకున్నారు. అప్పటి వరకు ఈ చిత్రం తో బిజినెస్ డీల్స్ పెట్టుకున్న వారంతా వెనక్కి వెళ్లిపోయారు , చివరికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ కూడా డీల్ ని రద్దు చేసుకుంది.
అయితే ఇప్పుడు ఆ సినిమా హీరో విజయ్ తమిళనాడు కే సీఎం అయ్యి కూర్చున్నాడు. దేశం మొత్తం ఆయన పేరు , ఆయన తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ‘జన నాయగన్’ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇప్పుడు మళ్లీ ఈ చిత్ర నిర్మాతలతో డీల్ మాట్లాడేందుకు ముందుకొచ్చింది. ఈసారి ఏకంగా 120 కోట్ల రూపాయిలు ఆఫర్ చేస్తున్నారట. ఇది చిన్న అమౌంట్ కాదు , ఓటీటీ మార్కెట్ క్రాష్ అయిన కారణంగా పాన్ ఇండియన్ చిత్రాలను కూడా ఈ రేంజ్ రేట్స్ కి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఓటీటీ సంస్థలు , అలాంటిది ఒక రీమేక్ సినిమాకు ఇంత క్రేజ్ పలకడం సీఎం విజయ్ బ్రాండ్ ఇమేజ్ కి నిదర్శనం అని అంటునారు. అంతే కాదు థియేట్రికల్ బిజినెస్ కి కూడా ప్రస్తుతం మార్కెట్ లో మామూలు రేంజ్ డిమాండ్ లేదనే చెప్పాలి, వందల కోట్ల ఆఫర్లు వస్తున్నాయి , చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది , మొదటి రోజు మాత్రం కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని , ఫుల్ రన్ లో తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.