Jana Nayagan Release Date: వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ చిత్రం ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగించుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది. సినిమాలో విద్వేషాలను రెచ్చగొట్టే సన్నివేశాల ఫుటేజీ దాదాపుగా 20 నిమిషాల వరకు ఉందని, వాటిని తొలగిస్తే తప్ప ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని సెన్సార్ సభ్యులు చెప్పడం తో మూవీ టీం హై కోర్టు కి వెళ్లడం, వాళ్ళు కూడా ఆ సన్నివేశాలు తొలగించాల్సిందే అని గట్టిగా చెప్పడం తో మేకర్స్ కి వేరే దారి లేక, ఆ సన్నివేశాలన్నీ తొలగించి, లేటెస్ట్ ఎడిటెడ్ వెర్షన్ ని రీసెంట్ గానే సెన్సార్ కి పంపించారు. రేపు కానీ , ఎల్లుండి కానీ ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ రానుంది. ఇక మేకర్స్ అనుకుంటున్నా విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇదే తేదీన రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ని విడుదల చేయబోతున్నట్టు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ఒక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్నీ ఆ చిత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇండస్ట్రీ లోని ముఖ్యులకు ఈ విషయాన్నీ ఇప్పటికే తెలియజేసారు. అందుకే KVN సంస్థ ‘జన నాయగన్’ చిత్రాన్ని ఏప్రిల్ 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. రేపు లేదా ఎల్లుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ గా తెరకెక్కిన చిత్రమిది. ఇక్కడ విజయ్ కి కూతురి క్యారెక్టర్ లో మమిత బైజు నటించగా, హీరోయిన్ పాత్రలో పూజ హెగ్డే నటించింది. జనవరి 9 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు కాబట్టి, థియేట్రికల్ ట్రైలర్ ni అప్పుడే విడుదల చేసేసారు. ఇప్పుడు విడుదల అవ్వబోతుంది కాబట్టి సరికొత్త ట్రైలర్ విడుదల చేస్తారేమో అనే ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. ఆలస్యం అయినా సరైన విడుదల తేదీ ని పెట్టేశారని, తమిళనాడు లో ఎన్నికల సమరం ముగిసిన వెంటనే విడుదల చేస్తున్నారని. కచ్చితంగా బ్లాక్ బస్టర్ డేట్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.