Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Movie Leak: 'జన నాయగన్ ' ని లీక్ చేసిన దొంగలు దొరికిపోయారు.....

Jana Nayagan Movie Leak: ‘జన నాయగన్ ‘ ని లీక్ చేసిన దొంగలు దొరికిపోయారు.. ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Jana Nayagan Movie Leak: గత మూడు నెలల నుండి ‘జన నాయగన్'(Jana Nayagan Movie) మూవీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి, మరో రెండు రోజుల్లో విడుదల అనగా, సెన్సార్ బోర్డు అనేక సన్నివేశాలకు అభ్యంతరం చెప్పడంతో విడుదల ఆగిపోయింది. ఇప్పటికీ ఈ చిత్రానికి సెన్సార్ నుండి సర్టిఫికేట్ రాలేదు. ఒకపక్క ఆ చిత్ర నిర్మాత ఈ టెన్షన్ లో ఉంటే , మరోపక్క ఈ సినిమా ని HD క్వాలిటీ తో ఆన్లైన్ లో లీక్ చేయడం అత్యంత దారుణమైన సంఘటనగా భావించవచ్చు. సోషల్ మీడియా లో ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నెలల తరబడి కష్టపడి తీసిన చిత్రం , ఇలా పైరసీ కి గురైతే , ఆ కడుపు కోత ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేనిది.

అయితే తమిళనాడు పోలీసులు , ఈ సినిమాని లీక్ చేసిన దొంగని పట్టుకోవడం లో సక్సెస్ అయ్యారు. ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్, మూవీ టీం సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని , అక్రమంగా ఎడిటింగ్ రూమ్ లోకి ప్రవేశించి , ఈ సినిమా డేటా ని దొంగలించి , మరో ఇద్దరికీ పంపించాడు. దీంతో ఈ సినిమా ఇంటర్నెట్ లోకి ప్రత్యక్షమైంది. అందుకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అంతే కాదు ఆ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ మరో సినిమాకు కూడా పని చేస్తున్నాడట. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ కి ‘రెడ్ జైన్ట్ మూవీస్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పటి వరకు ఈ సంస్థపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘జన నాయగన్’ చిత్రం లీక్ అవ్వడం వెనుక ఆయన హస్తం ఉందని అనుమానిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

పోలీసుల విచారణ లో కూడా మరో సినిమాకు పనిచేస్తున్నాడు అనే వార్త రావడం తో , విజయ్ అభిమానుల్లో ఈ అనుమానం మరింత బలపడింది. అయితే ప్రస్తుతానికి అధికారం స్టాలిన్ చేతుల్లోనే ఉంది కాబట్టి, ఒకవేళ ఉదయ్ నిధి స్టాలిన్ ఈ పైరసీ లీక్ చేసాడని విచారణ లో తేలినప్పటికీ కూడా బయటకు ఆ విషయాన్నీ రానివ్వరు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మరో వారం రోజుల్లో అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ అధికారం లోకి స్టాలిన్ రాబోతున్నాడు అని అత్యధిక శాతం సర్వేలు చెప్తుండడంతో , పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ చిత్రం గురించి ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version