https://oktelugu.com/

జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 2’ ఆగిపోయింది

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమెరాన్ 2009లో నిర్మించిన గ్రాఫికల్ వండర్ `అవతార్`.ప్రపంచ వ్యాప్తంగా అనేక సంచలనాలు సృష్టించింది జేమ్స్ కేమెరాన్ అద్భుత సృష్టిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అబ్బురపరిచిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డ్స్ నమోదు చేసింది. దరిమిలా “అవతార్” చిత్రానికి సీక్వెల్స్ రూపొందించే పనిలో దర్శకుడు జేమ్స్ కేమెరాన్ రెడీ అయ్యాడు కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేశాడు. అయితే జేమ్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 19, 2020 / 03:33 PM IST
    Follow us on

    హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమెరాన్ 2009లో నిర్మించిన గ్రాఫికల్ వండర్ `అవతార్`.ప్రపంచ వ్యాప్తంగా అనేక సంచలనాలు సృష్టించింది జేమ్స్ కేమెరాన్ అద్భుత సృష్టిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అబ్బురపరిచిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డ్స్ నమోదు చేసింది. దరిమిలా “అవతార్” చిత్రానికి సీక్వెల్స్ రూపొందించే పనిలో దర్శకుడు జేమ్స్ కేమెరాన్ రెడీ అయ్యాడు కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేశాడు.

    అయితే జేమ్స్ కేమెరాన్ ఆలోచనల్నికరోనా వైరస్ దెబ్బతీసేలా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కరాళ నృత్యం తో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగ్ లు ఏవీ సరిగ్గా జరగడం లేదు. తాజాగా ఈ లిస్ట్ లోకి జేమ్స్ కేమెరాన్ ఫిల్మ్ `అవతార్ 2` కూడా చేరింది.
    జేమ్స్ కేమెరాన్ రూపొందిస్తున్న `అవతార్ 2` చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతోంది. కరోనా వైరస్ ప్రభలుతుండటంతో సినిమా షూటింగ్ని ఆపేస్తున్నట్టు చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండా ఒక పత్రికా ప్రకటన లో వెల్లడించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం యదాతదంగా జరుగుతాయని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ముందు అనుకున్న డిసెంబర్లో కాకుండా వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిసింది.
    Carona spares no one