Balakrishna Mahabharata role: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలే గుర్తుకు వస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోల విషయంలో కూడా పలువురు సినిమా మేధావులు ఆసక్తికరమైన కామెంట్లైతే చేస్తున్నారు…రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సక్సెస్ లను సాధించాయి. దాంతో ఆయన పేరు ఒక్కసారిగా ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోతుంది. ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… మొత్తానికైతే రాజమౌళి చేయబోయే ‘మహాభారతం’ సినిమాలో బాలయ్య బాబుకి ఒక స్పెషల్ పాత్ర అయితే ఉంటుందట. ఆయన ఎవరి పాత్ర పోషిస్తాడనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు.
కానీ తెలుగు భాష మీద ఆయనకు ఉన్న పట్టు అలాగే దేవుళ్ల మీద ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ తో అతన్ని ఈ సినిమాలో తప్పకుండా ఒక భాగం చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఆలోచిస్తున్నాడట. మహాభారతంలో చాలా ఎక్కువ పాత్రలు ఉంటాయి. కాబట్టి అందులో బాలయ్య బాబు కి సెట్ అయ్యే పాత్రలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య బాబుకి ధర్మరాజు పాత్రను ఇవ్వచ్చు.
లేదంటే దుర్యోధనుడి గా కూడా తను మెప్పించగలడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…ఇక ఏదేమైనా కూడా బాలయ్య బాబుకు మహాభారతంలో ఏ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కుతుంది. తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవ్వబోతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఈ విషయం మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. కానీ రాజమౌళి తన సన్నిహితుల దగ్గర కొన్ని సందర్భాల్లో తెలియజేసినట్టుగా తెలుస్తుంది. నిజంగానే రాజమౌళి వారణాసి సినిమా తర్వాత మహాభారతం మొదలు పెట్టినట్టయితే మాత్రం చాలా మంది హీరో ఈ సినిమా కోసం వాళ్ల డేట్స్ ను ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది…